F3 15 Days Collections: ఎఫ్3కి దెబ్బ మీద దెబ్బ.. 15వ రోజు దారుణంగా.. అదే జరిగితే నష్టాలు తప్పవు!

టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తోన్న స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మల్టీస్టారర్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా F3 మూవీని రూపొందించారు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దీనికి మొదట్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా బాక్సాఫీస్ ఈ సినిమా కలెక్షన్లతో కళకళలాడింది. అయితే, క్రమంగా వసూళ్లు తగ్గిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమా 15 రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఇంకెంత వస్తే విజయాన్ని సొంతం చేసుకుంటుంది? అనే విషయాలు చూద్దాం పదండి!

 బడా హీరోల కలయికలో వచ్చింది

బడా హీరోల కలయికలో వచ్చింది

ఎఫ్ 2 వంటి సక్సెస్ తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్రాంచేజీ మూవీనే 'F3'. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా భాటియా, మెహరీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా చేశారు. సునీల్, సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్రలను పోషించారు. ఇక, ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు.

 ఎఫ్3 మూవీ థియేట్రికల్ బిజినెస్

ఎఫ్3 మూవీ థియేట్రికల్ బిజినెస్


'ఎఫ్3' మూవీకి ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీనికి తోడు వెంకటేష్‌కు, వరుణ్ తేజ్‌కు ఏపీ, తెలంగాణతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. దీంతో 'ఎఫ్3' మూవీ హక్కులకు పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి దీనికి రూ. 63.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ అయింది.

15వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది

15వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది


వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'ఎఫ్ 3' మూవీకి ఆరంభంలో మంచి టాక్ రావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. అయితే, దీనికి క్రమంగా ఆదరణ తగ్గడంతో వసూలు పడిపోతున్నాయి. ఇలా వారం నుంచి ఈ సినిమాకు దెబ్బలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో 15వ రోజు దీనికి రూ. 10 లక్షలు మాత్రమే వచ్చాయి.

 15 రోజులకు కలిపి ఎంత వచ్చింది

15 రోజులకు కలిపి ఎంత వచ్చింది


'ఎఫ్ 3' మూవీకి 15 రోజులకు కలిపి కలెక్షన్లు బాగానే వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 17.78 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.98 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.84 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.32 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.41 కోట్లు, గుంటూరులో రూ. 3.21 కోట్లు, కృష్ణాలో రూ. 2.82 కోట్లు, నెల్లూరులో రూ. 1.74 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 43.10 కోట్లు షేర్, రూ. 69.40 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది

మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది


ఏపీ, తెలంగాణలో చక్కగా రాణించిన 'ఎఫ్ 3' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ బాగానే రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో 15 రోజులకు రూ. 43.10 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.06 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా 15 రోజుల్లోనే ఈ మూవీ రూ. 53.11 కోట్లు షేర్, రూ. 89.02 కోట్లు గ్రాస్ రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్? ఎంత రావాలి

బ్రేక్ ఈవెన్ టార్గెట్? ఎంత రావాలి


ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'ఎఫ్ 3' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.60 కోట్లు మేర బిజినెస్ జరుపుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 64.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 15 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 53.11 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 11.39 కోట్లు వస్తే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను చేరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X