F3 16 Days Collections: మళ్లీ పెరిగిన కలెక్షన్లు.. అయినా తప్పని నిరాశ.. హిట్‌కు అన్ని కోట్ల దూరంలో!
టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోన్న దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకడు. ఇప్పటికే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఈ కుర్ర దర్శకుడు తాజాగా తెరకెక్కించిన చిత్రమే F3. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందిన 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) మూవీకి ఇది సీక్వెల్‌గా వచ్చింది. సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, దీనికి మొదట్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. అయితే, క్రమంగా వసూళ్లు తగ్గిపోతూనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో F3 మూవీ 16 రోజుల్లో ఎంత వసూలు చేసింది? విజయానికి ఇంకెన్ని కోట్ల దూరంలో ఉంది? అనే విషయాలు చూద్దాం పదండి!

మరోసారి కలిసొచ్చిన స్టార్ హీరోలు
టాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతోన్న వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్రాంచేజీ మూవీనే 'F3'. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా భాటియా, మెహరీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా చేశారు. సునీల్, సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్రలను పోషించారు. ఇక, ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

ఎఫ్3 మూవీ థియేట్రికల్ బిజినెస్
క్రేజీ కాంబోలో వచ్చిన 'ఎఫ్3' మూవీకి ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీనికి తోడు వెంకటేష్‌కు, వరుణ్ తేజ్‌కు ఏపీ, తెలంగాణతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. దీంతో ఈ మూవీ హక్కులకు పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 63.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

16వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది
స్టార్ హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో పాటు.. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా రావడంతో 'ఎఫ్ 3' మూవీపై అందరూ దృష్టి సారించారు. అందుకు అనుగుణంగానే ఆరంభంలో మంచి టాక్ వచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. అయితే, తర్వాత క్రమంగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో 16వ రోజు కాస్త పెరిగి దీనికి రూ. 16 లక్షలు వచ్చాయి.

16 రోజులకు కలిపి ఎంత వచ్చింది
16 రోజులకు కలిపి'ఎఫ్ 3' మూవీకి కలెక్షన్లు బాగానే వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 17.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.86 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.34 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.42 కోట్లు, గుంటూరులో రూ. 3.22 కోట్లు, కృష్ణాలో రూ. 2.83 కోట్లు, నెల్లూరులో రూ. 1.74 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 43.26 కోట్లు షేర్, రూ. 69.70 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది
ఆంధ్రా, తెలంగాణలో చక్కగా రాణించిన 'ఎఫ్ 3' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ బాగానే రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో 16 రోజులకు రూ. 43.26 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.96 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.07 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా 16 రోజుల్లోనే ఈ మూవీ రూ. 53.29 కోట్లు షేర్, రూ. 89.37 కోట్లు గ్రాస్ రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్? ఎంత రావాలి
క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'ఎఫ్ 3' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.60 కోట్లు మేర బిజినెస్ జరుపుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 64.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 16 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 53.29 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 11.21 కోట్లు వస్తే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.


Click it and Unblock the Notifications











