twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    F3 17 Days Collections: మూడు రెట్లు పెరిగిన వసూళ్లు.. రావాల్సింది 64 కోట్లు.. వచ్చింది మాత్రం!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు రావడంతో పాటు దర్శక నిర్మాతలు, హీరోలు ప్రయోగాలకు సిద్ధం అవడమే. ఇలా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) ఒకటి. ఇది వసూళ్ల వర్షం కురిపించడంతో దీనికి సీక్వెల్‌గా F3 మూవీని తెరకెక్కించారు. సూపర్ హిట్ కాంబినేషన్‌ కావడంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, దీనికి మొదట్లో భారీ కలెక్షన్లు వచ్చి ఆ తర్వాత తగ్గిపోయాయి. కానీ, ఆదివారం కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో F3 మూవీ 17 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

    ఫన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చేసింది

    ఫన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చేసింది

    టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్రాంచేజీ మూవీనే 'F3'. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా భాటియా, మెహరీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా చేశారు. సునీల్, సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్రలను పోషించారు. ఇక, ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.

    టెలివిజన్ స్టార్‌తో యాంకర్ వర్షిణి నైట్ పార్టీ: గట్టిగా వాటేసుకుని.. ఏదో తేడాగా ఉందేంటబ్బా!<br />టెలివిజన్ స్టార్‌తో యాంకర్ వర్షిణి నైట్ పార్టీ: గట్టిగా వాటేసుకుని.. ఏదో తేడాగా ఉందేంటబ్బా!

    ఎఫ్3 మూవీ థియేట్రికల్ బిజినెస్

    ఎఫ్3 మూవీ థియేట్రికల్ బిజినెస్

    బడా మల్టీస్టారర్‌గా వచ్చిన 'ఎఫ్3' మూవీకి ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీనికి తోడు వెంకటేష్‌కు, వరుణ్ తేజ్‌కు ఏపీ, తెలంగాణతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. దీంతో ఈ మూవీ హక్కులకు పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 63.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

    17వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది

    17వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది

    సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా రావడంతో పాటు ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో 'ఎఫ్ 3'పై అందరూ దృష్టి సారించారు. అందుకు అనుగుణంగానే ఆరంభంలో మంచి టాక్ వచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. అయితే, తర్వాత క్రమంగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో 17వ రోజు మూడు రెట్టి పెరిగి రూ. 50 లక్షలు కలెక్ట్ అయ్యాయి.

    బ్రాతో హమీదా ఎద అందాల ఆరబోత: అబ్బో ఆమెను ఇలా చూశారంటే!బ్రాతో హమీదా ఎద అందాల ఆరబోత: అబ్బో ఆమెను ఇలా చూశారంటే!

    17 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    17 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    'ఎఫ్ 3' మూవీకి 17 రోజులకు కలిపి కలెక్షన్లు బాగానే వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.09 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.99 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.38 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.44 కోట్లు, గుంటూరులో రూ. 3.25 కోట్లు, కృష్ణాలో రూ. 2.86 కోట్లు, నెల్లూరులో రూ. 1.75 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 43.76 కోట్లు షేర్, రూ. 70.75 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

    మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది

    మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది

    ఏపీ, తెలంగాణలో చక్కగా రాణించిన 'ఎఫ్ 3' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ బాగానే రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో 17 రోజులకు రూ. 43.76 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.10 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా 17 రోజుల్లోనే ఈ మూవీ రూ. 53.86 కోట్లు షేర్, రూ. 90.40 కోట్లు గ్రాస్ రాబట్టింది.

    దీప్తి సునైనా హాట్ వీడియో వైరల్: బెడ్‌పై అలా చూపిస్తూ.. ఇది చూశారంటే!దీప్తి సునైనా హాట్ వీడియో వైరల్: బెడ్‌పై అలా చూపిస్తూ.. ఇది చూశారంటే!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్? ఎంత రావాలి

    బ్రేక్ ఈవెన్ టార్గెట్? ఎంత రావాలి

    ఫన్ ఎంటర్‌టైనర్‌గా ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'ఎఫ్ 3' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.60 కోట్లు మేర బిజినెస్ జరుపుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 64.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 17 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 53.86 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 10.64 కోట్లు వస్తే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

    English summary
    Daggubati Venkatesh, Varun Tej Did F3 Movie under Anil Ravipudi Direction. This Movie Collect Rs 53.86 Crore in 17 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X