F3 19 Days Collections: స్థిరంగా వసూళ్లు.. అయినా బ్రేక్ ఈవెన్ కష్టమే.. ఎన్ని కోట్లు రావాలంటే?
ఈ మధ్య కాలంలో సూపర్ హిట్స్ గా నిలిచిన మల్టీస్టారర్ సినిమాలలో ఎఫ్2 ఒకటి. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'F2' సూపర్ హిట్ గా నిలవడంతో సీక్వెల్ తెరకెక్కిస్తామని ప్రకటించారు. ప్రకటించినట్టుగానే ఆ సినిమాకి సీక్వెల్‌గా F3 అనే మూవీని భారీ స్టార్ క్యాస్టింగ్ తో రూపొందించారు. ఈ క్రమంలోనే సీక్వెల్ ప్రకటించిన నాటి నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. భారీ అంచనాలతో మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చడంతో ముందు మంచి కలెక్షన్స్ దక్కినా ఇప్పుడు క్రమంగా తగ్గిపోయాయి. ఇక ఈ క్రమంలో ఈ సినిమా 19 రోజుల్లో ఎంత వసూలు చేసిందో బాక్సాఫీస్ రిపోర్టులో చూద్దాం!

మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ తో
టాలీవుడ్లో రెండు బడా ఫామిలీలకు చెందిన హీరోలు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో అపజయమే ఎరుగని అనిల్ రావిపూడి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ 'F3'. ఈ సినిమాలో తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్లుగా నటించగా సునీల్, సోనాల్ చౌహాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ప్రేక్షకుల నాడి తెలిసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో అలరించింది. ఇన్ని ప్రత్యేకతలు ఉండడంతోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

భారీగా డ్రాప్
'ఎఫ్ 3'కు 18వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగా డ్రాప్ కాగా 19వ రోజు కూడా సేం సీన్ రిపీట్ అయింది. ఈ క్రమంలో నైజాంలో రూ. 5 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1 లక్ష, వెస్ట్‌లో రూ. 1 లక్ష, గుంటూరులో రూ. 1 లక్ష, కృష్ణాలో రూ. 1 లక్ష, నెల్లూరులో రూ. లక్ష లోపు కలెక్షన్స్ తో రెండు రాష్ట్రాల్లో కలిపి కేవలం రూ. 16 లక్షల షేర్ రాబట్టింది.

19 రోజులకు
'ఎఫ్ 3' మూవీకి 19 రోజులకు కలిపి కలెక్షన్లు బాగానే వచ్చాయని చెప్పాలి. అయితే బిజినెస్ కు తగినట్టు మాత్రం కలెక్షన్స్ కనిపించమే రాలేదు. 19 రోజులకు కలిపి నైజాంలో రూ. 18.11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.14 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.07 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.40 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.46 కోట్లు, గుంటూరులో రూ. 3.27 కోట్లు, కృష్ణాలో రూ. 2.88 కోట్లు, నెల్లూరులో రూ. 1.75 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 44.08 కోట్లు షేర్, రూ. 71.05 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా 19 రోజుల్లో
19 రోజులకు ఆంధ్ర, తెలంగాణలో సత్తా చాటిన 'ఎఫ్ 3' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో 19 రోజులకు రూ. 44.08 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.03 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.12 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా 19 రోజుల్లోనే ఈ మూవీ రూ. 54.23 కోట్లు షేర్, రూ. 91.07 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ఇంకా ఎన్ని కోట్లు సాధించాలంటే?
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'ఎఫ్ 3' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేయడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 64.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 19 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 54.23 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 10.27 కోట్లు వస్తే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది. ఇప్పుడు F3 సినిమాకు పోటీగా ఉన్న సినిమాలతో బేరీజు వేసుకుంటే ఈ సినిమా ఆ స్టేటస్ అందుకోవడం అసాధ్యమని అంటున్నారు విశ్లేషకులు. మరో రెండ్రోజుల్లో విరాటపర్వం సినిమా ఉండడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కష్టమే అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











