F3 movie Day 2 collections : రెండో రోజు ఊహించని డ్రాప్.. ఎంత వసూలు చేసిందంటే?
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన తాజా చిత్రం F3, ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన విడుదలైన F2 సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు ఏ మేరకు కలెక్షన్ల వర్షం కురిపించారు అనేది బాక్సాఫీస్ రిపోర్ట్ లో చూద్దాం

కలెక్షన్ ల వర్షం
వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ హీరోగా తమన్నా, మెహరీన్ కౌర్ హీరోయిన్లుగా తెరకెక్కించి హిట్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. అదే సినిమాకు కొనసాగింపుగా F3 చేస్తామని అప్పట్లోనే ప్రకటించారు. ప్రకటించిన విధంగానే సినిమా చేశారు కానీ కరోనా కారణంగా సినిమా అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా మే 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిశ్రమ స్పందన అందుకున్న ఈ సినిమాకు మొదటి రోజు కలెక్షన్ ల వర్షం కురిసింది.

F3 మూవీ ప్రీ రిలీజ్
తెలుగు రాష్ట్రాల్లో F3 మూవీ ప్రీ రిలీజ్ విషయానికి వస్తే నైజాంలో 18 కోట్లు, ఆంధ్రాలో 25 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 53.8 కోట్ల మేర బిజినెస్ నమోదైంది. అలాగే కర్ణాటకలో 3.4 కోట్లు, మిగతా రాష్ట్రాల్లో 1.2 కోట్లు, ఓవర్సీస్‌లో 5.20 కోట్ల బిజినెస్ నమోదు చేసింది. ఇక మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 63.6 కోట్ల బిజినెస్ చేసింది. అలా 64.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగింది.

2వ రోజు తెలుగు రాష్ట్రాల్లో
ఇక F3 సినిమా రెండో రోజు నైజాంలో 4.10 కోట్లు వసూలు చేసింది. సీడెడ్‌లో 1.12 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.04 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 52 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 28 లక్షలు, గుంటూరు జిల్లాలో 54 లక్షలు, కృష్ణా జిల్లాలో 51 లక్షలు, నెల్లూరు జిల్లాలో 24 లక్షలు రాబట్టింది. దాంతో 13.25 కోట్ల గ్రాస్, 8.35 కోట్ల షేర్ సాధించింది.

రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా
ప్రపంచవ్యాప్తంగా F3 కలెక్షన్ల విషయానికి వస్తే F3 సినిమా మొదటి రోజు లాగానే కర్ణాటక, సలహా ఇతర రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో కలిపి 25 లక్షలు, ఓవర్సీస్‌లో 1.45 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 16.25 కోట్ల గ్రాస్, 9.85 కోట్ల షేర్‌ను రెండో రోజున నమోదు చేసింది.

రెండు రోజులకు కలిపి
ఇక F3 సినిమా రెండు రోజులకు కలిపి రోజు నైజాంలో 8.16 కోట్లు వసూలు చేసింది. సీడెడ్‌లో 2.38 కోట్లు, ఉత్తరాంధ్రలో 2.22 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 1.28 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 1.22 కోట్లు, గుంటూరు జిల్లాలో 1.42 కోట్లు, కృష్ణా జిల్లాలో 1.17 కోట్లు, నెల్లూరు జిల్లాలో 85 లక్షలు రాబట్టింది. అలాగే కర్ణాటక 1.20 కోట్లు, ఓవర్సీస్ 3.60 కోట్లు కలెక్ట్ అయింది. దీంతో 20.25 కోట్ల గ్రాస్,18.70 కోట్ల షేర్ సాధించింది.
Recommended Video


F3 మూవీ లాభాల్లోకి రావాలంటే
F3 చిత్రం 64.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో కలెక్షన్ల బరిలోకి దిగింది. రెండు రోజులకు రోజున 23.50 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా 41 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఈ చిత్రం ఏ మేరకు లాభాలను నమోదు చేస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











