F3 2 Weeks Collections: 64 కోట్ల టార్గెట్.. 2 వారాల్లో షాకింగ్‌గా.. హిట్ అవ్వాలంటే అదే జరగాలి!
తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా విజయాలను సొంతం చేసుకున్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే అతడు ఎన్నో హిట్ చిత్రాలను అందుకున్నాడు. అందులో వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) ఒకటి. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో దీనికి సీక్వెల్‌గా F3 మూవీని రూపొందించారు. దీనికి మొదట్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా బాక్సాఫీస్ గళగళలాడిపోయింది. అయితే, క్రమంగా వసూళ్లు తగ్గిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమా రెండు వారాల్లో ఎంత వసూలు చేసింది? ఇంకెంత వస్తే హిట్ అవుతుంది? అనే విషయాలు చూద్దాం పదండి!

నవ్వించాలని వచ్చిన స్టార్ హీరోలు
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన మరో భారీ మల్టీస్టారర్ మూవీనే 'F3'. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా భాటియా, మెహరీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా చేశారు. సునీల్, సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్రలను పోషించారు. ఇక, ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

ఎఫ్3 మూవీ థియేట్రికల్ బిజినెస్
వెంకటేష్‌కు, వరుణ్ తేజ్‌కు ఏపీ, తెలంగాణతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. దీనికితోడు F2 వంటి భారీ హిట్ మూవీ తర్వాత ఇద్దరూ కలిసి చేసిన సినిమా కావడంతో 'ఎఫ్3' మూవీ హక్కులకు పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలుపుకుని దీనికి రూ. 63.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

14వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది
'ఎఫ్ 3' మూవీకి ఆరంభంలో మంచి టాక్ రావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. దీంతో చాలా ఏరియాల్లో ఈ సినిమా అద్భుతమైన నెంబర్లను నమోదు చేసుకుంది. అయితే, దీనికి క్రమంగా ఆదరణ తగ్గడంతో వసూలు పడిపోతున్నాయి. దీంతో ఏపీ, తెలంగాణలో కలిపి 14వ రోజు ఈ సినిమాకు మరీ దారుణంగా రూ. 15 లక్షలు మాత్రమే వచ్చాయి.

2 వారాలకు కలిపి ఎంత వచ్చింది
'ఎఫ్ 3' మూవీకి 2 వారాలకు కలిపి కలెక్షన్లు భారీగానే వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 17.75 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.96 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.82 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.31 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.41 కోట్లు, గుంటూరులో రూ. 3.20 కోట్లు, కృష్ణాలో రూ. 2.81 కోట్లు, నెల్లూరులో రూ. 1.74 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 43.00 కోట్లు షేర్, రూ. 69.25 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది
ఏపీ, తెలంగాణలో చక్కగా రాణించిన 'ఎఫ్ 3' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ బాగానే రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో 14 రోజులకు రూ. 43 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.94 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.04 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా 2 వారాల్లోనే ఈ మూవీ రూ. 52.98 కోట్లు షేర్, రూ. 88.80 కోట్లు గ్రాస్ రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్? ఎంత రావాలి
స్టార్ హీరోల కలయికలో వచ్చిన 'ఎఫ్ 3' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 64.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 2 వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.98 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 11.52 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌ను చేరుతుంది.


Click it and Unblock the Notifications











