F3 3 Weeks Collections: 64 కోట్ల టార్గెట్.. 3 వారాల్లో షాకింగ్‌గా.. అదే జరిగితే నష్టాలు తప్పవు!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో సీక్వెల్ మూవీలో ఎక్కువగా వస్తున్నాయి. అందులో F3 ఒకటన్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన మల్టీస్టారర్ మూవీ 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్)కు ఇది సీక్వెల్‌గా రూపొందింది. సూపర్ హిట్ కాంబినేషన్‌ కావడంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, దీనికి మొదట్లో భారీ కలెక్షన్లు వచ్చినా.. ఆ తర్వాత తగ్గిపోయాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకునే అవకాశాలు సంక్లిష్టం అయిపోయాయి. ఈ నేపథ్యంలో F3 మూవీ 3 వారాల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఇంకెంత వెనుకబడి ఉంది? అనేవి చూద్దాం పదండి!

స్టార్ హీరోలో కాంబోలో వచ్చేసింది

స్టార్ హీరోలో కాంబోలో వచ్చేసింది

స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్రాంచేజీ మూవీనే 'F3'. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా భాటియా, మెహరీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా చేశారు. సునీల్, సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్రలను పోషించారు. ఇక, ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

ఎఫ్3 మూవీ థియేట్రికల్ బిజినెస్

ఎఫ్3 మూవీ థియేట్రికల్ బిజినెస్

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'ఎఫ్3' మూవీకి ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీనికి తోడు వెంకటేష్‌కు, వరుణ్ తేజ్‌కు ఏపీ, తెలంగాణతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. దీంతో ఈ మూవీ హక్కులకు పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 63.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ అయింది.

21వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది

21వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది

గతంలో సంక్రాంతి సీజన్‌లో తెగ సందడి చేసిన 'ఎఫ్2'కు సీక్వెల్‌గా వచ్చిన చిత్రం కావడంతో 'ఎఫ్ 3'కి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన దక్కింది. అందుకు అనుగుణంగానే ఆరంభంలో మంచి టాక్ రావడంతో కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. అయితే, ఇవి తర్వాత క్రమంగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో 21వ రోజు దీనికి చాలా తక్కువగా అంటే రూ. 10 లక్షలే వచ్చాయి.

3 వారాలకు కలిపి ఎంత వచ్చింది

3 వారాలకు కలిపి ఎంత వచ్చింది

'ఎఫ్ 3' మూవీకి 3 వారాలకు కలిపి కలెక్షన్లు బాగానే వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 18.19 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.18 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.13 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.41 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.46 కోట్లు, గుంటూరులో రూ. 3.28 కోట్లు, కృష్ణాలో రూ. 2.90 కోట్లు, నెల్లూరులో రూ. 1.75 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 44.30 కోట్లు షేర్, రూ. 71.40 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది

మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది

ఆంధ్రా, తెలంగాణలో చక్కగా రాణించిన 'ఎఫ్ 3' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ బాగానే రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో 3 వారాలకు రూ. 44.30 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.04 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.13 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా 21 రోజుల్లోనే ఈ మూవీ రూ. 54.47 కోట్లు షేర్, రూ. 91.50 కోట్లు గ్రాస్ రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్? ఎంత రావాలి

బ్రేక్ ఈవెన్ టార్గెట్? ఎంత రావాలి

సూపర్ హిట్ కాంబోలో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'ఎఫ్ 3' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.60 కోట్లు మేర బిజినెస్ జరుపుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 64.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 3 వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 54.47 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 10.03 కోట్లు వస్తే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X