F3 8 Days Collections: ఎఫ్3 మూవీకి బిగ్ షాక్.. అప్పుడే అంత తక్కువగా.. ఇంకెంత రావాలంటే!

టాలీవుడ్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చి.. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో దీనికి సీక్వెల్‌గా F3 అనే మూవీని రూపొందించారు. హిట్ కాంబినేషన్‌ కావడంతో ఆరంభంలోనే ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఫలితంగా భారీ స్థాయిలో బిజినెస్‌ను చేసుకుంది. ఇలా గత వారమే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌తో పాటు వసూళ్లను కూడా చక్కగా రాబడుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ చిత్రం 8 రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఇంకెంత వస్తే హిట్ అవుతుంది? అనేవి అంశాలపై ఓ లుక్కేద్దాం పదండి!

సూపర్ హిట్ కాంబినేషణ్‌లో ఎఫ్3

సూపర్ హిట్ కాంబినేషణ్‌లో ఎఫ్3

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసిన మల్టీస్టారర్ మూవీనే 'F3'. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా భాటియా, మెహరీన్ ఫిర్జాదా హీరోయిన్లు. సునీల్, సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్రలను పోషించారు. ఇక, ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు.

 ఎఫ్3 మూవీ థియేట్రికల్ బిజినెస్

ఎఫ్3 మూవీ థియేట్రికల్ బిజినెస్

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా వెంకటేష్, వరుణ్ తేజ్‌కు మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. దీనికితోడు F2 వంటి భారీ హిట్ మూవీ తర్వాత ఇద్దరూ కలిసి చేసిన సినిమా కావడంతో 'ఎఫ్3'కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లో కలుపుకుని భారీ స్థాయిలో రూ. 63.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో దీన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

8వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది

8వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది

8వ రోజు 'ఎఫ్ 3'కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 23 లక్షలు, సీడెడ్‌లో రూ. 11 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్‌లో రూ. 9 లక్షలు, వెస్ట్‌లో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 77 లక్షలు షేర్, రూ. 1.25 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

 8 రోజులకు కలిపి ఎంత వచ్చింది

8 రోజులకు కలిపి ఎంత వచ్చింది

'ఎఫ్ 3' మూవీకి 8 రోజులకు కలిపి కలెక్షన్లు భారీగానే వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 16.63 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.49 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.30 కోట్లు, ఈస్ట్‌లో రూ. 2.95 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.16 కోట్లు, గుంటూరులో రూ. 2.89 కోట్లు, కృష్ణాలో రూ. 2.54 కోట్లు, నెల్లూరులో రూ. 1.58 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 39.54 కోట్లు షేర్, రూ. 63.40 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది

మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది

ఏపీ, తెలంగాణలో రాణించిన 'ఎఫ్ 3' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ పర్వాలేదనిపించింది. రెండు రాష్ట్రాల్లో 8 రోజులకు రూ. 39.54 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.67 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.80 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లోనే ఈ మూవీ రూ. 49.01 కోట్లు షేర్, రూ. 81.80 కోట్లు గ్రాస్ రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్? ఎంత రావాలి

బ్రేక్ ఈవెన్ టార్గెట్? ఎంత రావాలి

భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన 'ఎఫ్ 3' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 64.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 49.01 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 15.49 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X