twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    F3 9 Days Collections: మేజర్ దెబ్బకు పని చేయని వరుణ్, వెంకీ హవా.. ఆ రేంజ్ లో నష్టాలు వచ్చినట్లే?

    |

    విక్టరీ వెంకటేష్ మెగా యువ హీరో వరుణ్ తేజ్ కలిసి నటించిన రెండవ సినిమా F 3 ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ లో ఊహించినట్లుగానే మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే వారం రోజుల వరకు బాగానే ఉన్న కలెక్షన్స్ 8 వ రోజు నుంచి తగ్గుతూ వచ్చాయి. అడివి శేష్ మేజర్ సినిమా నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది అనే చెప్పాలి. ఇక ఈ సినిమా 9వ రోజు వసూళ్లు కొంత పెరిగినప్పటికి ఫైనల్ గా థియేట్రికల్ గా అయితే కొంత నష్టాలతోనే క్లోజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తొమ్మిదవ రోజు వచ్చిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే వివరాల్లోకి వెళితే..

    ఆ డిమాండ్ తో భారీగా బిజినెస్

    ఆ డిమాండ్ తో భారీగా బిజినెస్

    2019 లో వచ్చిన F2 సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద 127 కోట్లకు పైగా కలెక్షన్స్ రావడంతో ఆ సినిమాకు ఫ్రాంచైజ్ గా కొనసాగించాలని దర్శకుడు అనిల్ రావిపూడి మరో కథతో F3 సినిమాను రూపొందించాడు. ఇక ఈ సినిమాకు కాంబినేషన్ తోనే మంచి మార్కెట్ ఏర్పడింది. బాక్సాఫీస్ వద్ద 63.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

    9వ రోజు వచ్చిన కలెక్షన్స్

    9వ రోజు వచ్చిన కలెక్షన్స్


    మొదటి వారం బాక్సాఫీస్ వద్ద బాగానే నిలబడిన F3 సినిమా 8వ రోజు నుంచి మాత్రం కలెక్షన్స్ చాలా వరకు తగ్గుతూ వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా 9వ రోజు వచ్చిన షేర్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 28 లక్షలు, సీడెడ్‌లో రూ. 13 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్‌లో రూ. 11 లక్షలు, వెస్ట్‌లో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 99 లక్షలు షేర్, రూ. 1.25 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

     తెలుగు రాష్ట్రాల్లో టోటల్ కలెక్షన్స్

    తెలుగు రాష్ట్రాల్లో టోటల్ కలెక్షన్స్

    'ఎఫ్ 3' మూవీకి శుక్రవారం కంటే శనివారం రోజు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఇక టోటల్ గా 9రోజులకు వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 16.91 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.62 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.44 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.06 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.23 కోట్లు, గుంటూరులో రూ. 2.97 కోట్లు, కృష్ణాలో రూ. 2.61 కోట్లు, నెల్లూరులో రూ. 1.62 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 40.46 కోట్లు షేర్, రూ. 65 కోట్లు గ్రాస్‌ ను కలెక్ట్ చేసింది.

    వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    ఏపీ, తెలంగాణలో F 3 సినిమా 9 రోజుల్లో కలెక్షన్స్ పర్వాలేదు అనే విధంగానే వచ్చాయి. ఇక మిగిలిన ఏరియాల్లో వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో 9 రోజులకు రూ. 40.46 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.72 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.85 కోట్లను సాధించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల్లో రూ. 50.03 కోట్లు షేర్, రూ. 83.68 కోట్లు గ్రాస్ రాబట్టింది.

    ఇంకా ఎంత రావాలంటే?

    ఇంకా ఎంత రావాలంటే?

    కామెడీ మల్టీస్టారర్ గా F2 కు ఫ్రాంచైజ్ గా వచ్చిన F3 సినిమా మంచి డిమాండ్ తోనే బాక్సాఫీస్ వద్ద భారీగా బిజినెస్ చేసింది. టికెట్ల రేట్లు కూడా తగ్గించి ఆడియెన్స్ ను బాగానే ఎట్రాక్ట్ చేశారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 63.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 50.03కోట్ల షేర్ అందుకుంది. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇంకా 14.47 కోట్ల షేర్ సాధించాలి.

    ఆ రేంజ్ లో నష్టాలు?

    ఆ రేంజ్ లో నష్టాలు?

    ప్రస్తుతం మేజర్ తో పాటు విక్రమ్ సినిమా కూడా మంచి కలెక్షన్స్ అందుకుంటున్నాయి. వీకెండ్ అనంతరం కూడా వాటి వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక F3 పై ప్రభావం తప్పేలా లేదని తెలుస్తోంది. థియేట్రికల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 8 నుంచి 10కోట్ల మధ్యలోనే నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా టాక్ వస్తోంది.

    English summary
    F3 Movie 9 days total worldwide box office collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X