twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    F3 movie day 1 Collections.. వెంకీ, వరుణ్ మూవీకి అలాంటి రెస్పాన్స్.. తొలి రోజు ఎంతంటే?

    |

    బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొన్న F2 చిత్రానికి ఫ్రాంచైజీగా రూపొందిన F3 చిత్రం తొలి ఆట నుంచి డివైడ్ టాక్‌తో ముందుకెళ్తున్నది. లాజిక్‌ లేని కామెడీ ఓ వర్గం ఆస్వాదిస్తుంటే.. మరో వర్గం పెదవి విరుస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో వెంకటేశ్, వరుణ్ సందేశ్ నటించిన ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్, తొలి రోజుల కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే..

    ఆఫ్‌లైన్ బుకింగ్‌ ద్వారా

    ఆఫ్‌లైన్ బుకింగ్‌ ద్వారా


    F3 చిత్రానికి సంబంధించిన కలెక్షన్లు విషయంలో విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. ఆన్‌లైన్ బుకింగ్‌కు పెద్దగా స్పందన కనిపించలేదు. కానీ ఆఫ్‌లైన్ బుకింగ్ ద్వారా టికెట్లు భారీగానే అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా తొలి రోజున 70 శాతం అక్యుపెన్సీతో ముందుకెళ్లింది.

    తెలుగు రాష్ట్రాల్లో..

    తెలుగు రాష్ట్రాల్లో..


    F3 సినిమా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన రాబట్టుకొన్నది. నైజాంలో తొలి రోజున 4 కోట్లు, ఆంధ్రాలో 6 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 2 కోట్ల రూపాయలను వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం వెంకీ, వరుణ్ తేజ్ కెరీర్‌లో అత్యుత్తమ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

    ఆస్ట్రేలియాలో వసూళ్లు

    ఆస్ట్రేలియాలో వసూళ్లు


    F3 చిత్రానికి ఓవర్సీస్‌లో ఓ మోస్తారు స్పందన కనబడుతున్నది. వెంకటేష్, వరుణ్ సందేశ్ లాంటి హీరోలకు పెద్దగా మార్కెట్ లేకపోవడం వల్ల యావరేజ్‌గా ఓపెనింగ్ బుకింగ్స్ సొంతం చేసుకొన్నది. ఆస్ట్రేలియాలో ఈ సినిమాను 46 లొకేషన్లలో 83 షోల ద్వారా 3260 టికెట్లు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా తొలి రోజున 80k డాలర్లు అంటే.. 44 లక్షల రూపాయలను వసూలు చేసింది.

    అమెరికాలో కలెక్షన్లు

    అమెరికాలో కలెక్షన్లు


    అమెరికాలో కూడా F3 సినిమాకు పెద్దగా స్పందన కనిపించలేదు. ప్రీమియర్లు, తొలి రోజు అడ్వాన్సు బుకింగ్‌ ద్వారా యావరేజ్‌గా కలెక్షన్లు సంపాదించింది. 300 లోకేషన్లలో 588 షోల ద్వారా ఈ చిత్రం 260k డాలర్లను వసూలు చేసింది. తొలి రోజు ముగిసిన తర్వాత మరికొంత కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

    ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే?

    ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే?


    F3 చిత్రానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల అంచనాకు వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల వరకు, కర్ణాటక, ఓవర్సీస్‌లో మరో 1 కోటి రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ రేంజ్ కలెక్షన్లు సాధిస్తే.. కొద్ది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

    బ్రేక్ ఈవెన్ సాధించాలంటే?

    బ్రేక్ ఈవెన్ సాధించాలంటే?


    ఇక F3 చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 65 కోట్లకుపైగా, ఓవర్సీస్, ఇతర ప్రాంతాల రైట్స్ మరో 20 కోట్లకు అమ్ముడైనట్టు ట్రేడ్ వర్గాల రిపోర్టు. ఈ సినిమా 86 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించినట్టు సమాచారం. అయితే రానున్న రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.

    English summary
    Venkatesh, Varun Sandesh's F3 going with mixed response. Here is the day 1 expected collections worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X