F3 movie day 2 collections బాక్సాఫీస్ వద్ద ఊహించని రెస్పాన్స్.. రెండో రోజు కలెక్షన్ల పరిస్థితి ఇలా..

వినోదం, ఎమోషన్స్ అందించే లక్ష్యంతో రూపొందిన F3 మూవీ అంచనాలకు తగినట్టే కాసులు వర్షం కురిపిస్తున్నది. తొలి రోజు 23 కోట్ల గ్రాస్, 13.35 కోట్ల షేర్‌ను వసూలు చేసి ట్రేడ్ వర్గాల్లో జోష్ పెంచింది. ఇక రెండో రోజు కూడా అదే జోష్ బాక్సాఫీస్ వద్ద కనిపించింది. తొలి రోజుతో సమానంగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే రెండో రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే..

జబర్దస్త్ కామెడీకి మించి

జబర్దస్త్ కామెడీకి మించి

F3 చిత్రం నాటు కామెడీ, జబర్దస్త్ కామెడీ మాదిరిగా ఉందనే అభిప్రాయం సినీ విమర్శకుల్లో వ్యక్తమైంది. అయితే వినోదం కోసం అంతగా దిగజారాల్సిన అవసరం లేదనే విషయాన్ని ప్రస్తావించారు. ఏది ఏమైనప్పటికీ F2 మూవీ సక్సెస్, క్రేజ్ ఈ సినిమా కోసం ప్రేక్షకులను రప్పించింది. అయితే F2 మాదిరిగా రిపీట్ ఆడియెన్స్ ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది.

రెండో రోజు మంచి ఆక్యుపెన్సీ

రెండో రోజు మంచి ఆక్యుపెన్సీ

అయితే ఇలాంటి అభిప్రాయాలను పక్కన పెడితే. రెండో రోజు మంచి కలెక్షన్లు నమోదయ్యాయి. ఉదయం ఆట ఆక్యుపెన్సీ తగ్గినట్టు కనిపించినా.. మధ్యాహ్నం నుంచి వసూళ్లు పెంచుకొన్నాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజున మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందనే ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.

ఓవర్సీస్‌లో కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే

ఓవర్సీస్‌లో కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే

ఇక F3 చిత్రం ఓవర్సీస్‌లో ముఖ్యంగా అమెరికాలో మంచి రెస్పాన్స్ రాబడుతున్నది. ఆస్ట్రేలియాలో, యూకే, న్యూజిలాండ్‌లో ఓ మోస్తారు స్పందన కనిపిస్తున్నది. అమెరికాలో ఈ వారాంతంలోగా ఒక మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టే అవకాశం కనిపిస్తున్నది. తొలి రోజు ఓవర్సీస్‌లో 2.15 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజున ఆ రేంజ్‌కు అటు ఇటుగా వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా అంటే..

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా అంటే..

ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉంది. రెండో రోజున ఈ చిత్రం 7 కోట్లకుపైగా షేర్ సాధించే అవకాశం ఉంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని విడుదలైన అన్ని కేంద్రాల్లో యావరేజ్‌గా 75 శాతం అక్యుపెన్సీ నమోదు అయింది. దాంతో ఈ చిత్రం రెండో రోజు వసూళ్లపై ఆశలు పెరిగాయి.

నైజాం, ఆంధ్రాలో ప్రాంతా వారీగా

నైజాం, ఆంధ్రాలో ప్రాంతా వారీగా

F3 చిత్రం తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో అందిన సమాచారం ప్రకారం వసూళ్లు ఇలా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 1.38 కోట్లు, వైజాగ్‌లో 16.71 లక్షలు వరంగల్ 7.87 లక్షలు, విజయవాడలో 12.16 లక్షలు, నిజమాబాద్‌లో 1.79 లక్షలు, రాజమండ్రిలో 3.43 లక్షలు, కరీంనగర్‌లో 2.2 లక్షలు, కాకినాడలో 1.9 లక్షలు, తిరుపతి 3.82 లక్షలు, అనంతపురం 60 వేలు. బెంగళూరులో 39 లక్షలు, చెన్నైలో 7.17 లక్షల మేర వసూలు చేస్తుందనే అంచనాకు ట్రేడ్ వర్గాలు వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల అంచనా

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల అంచనా


ప్రపంచవ్యాప్తంగా F3 చిత్రం సాధించే కలెక్షన్ల అంచనాకు వస్తే.. ప్రపంచవ్యాప్తంగా 8 నుంచి 10 కోట్లకుపైగా షేర్ సాధించే అవకాశం ఉంది. ఇప్పటికే 13 కోట్లకుపైగా వసూలు చేయగా.. ఈ చిత్రం రెండో రోజున 20 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X