F3 movie day 3 collections బాక్సాఫీస్‌ను కుమ్మేసిన వెంకీ మామ.. మూడో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?
ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అనిల్ రావిపూడి రూపొందిన F3 చిత్రం మూడో రోజు అంటే.. ఆదివారం భారీ వసూళ్లను నమోదు చేసింది. గత రెండు రోజుల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఈ చిత్రం మూడో రోజు సెలవు దినం కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ భారీగా తరలివచ్చారు. దాంతో ఈ చిత్రానికి సంబంధించిన కలెక్షన్లు ట్రేడ్ వర్గాల్లో జోష్ పెంచాయి. అయితే మూడో రోజుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో
F3 మూవీ ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, అమెరికాలో మంచి కలెక్షన్లను రాబడుతున్నది. గత మూడు రోజుల్లో ఆస్ట్రేలియాలో 196,169 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 1.09 కోట్లు రాబట్టింది. అలాగే న్యూజిలాండ్‌లో 19,548 న్యూజిలాండ్ డాలర్లు అంటే 9.9 లక్షలు వసూలు చేసింది. యూకేలో కూడా ఈ చిత్రం భారీగానే వసూళ్లను రాబట్టింది.

అమెరికాలో 3వ రోజు వసూళ్లు
ఇక అమెరికాలో F3 మూవీ చిత్రం రెండో రోజుల్లో ప్రీమియర్లతో కలిపి 750K డాలర్లు రాబట్టింది. ఆదివారం ఈ చిత్రం కడపటి వార్తలు అందేసరికి 124K డాలర్లు వసూలు చేసింది. సోమవారం కల్లా ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరేందుకు సిద్దమైంది. టైప్ 2 హీరోల సినిమా కేటగిరీలో ఈ చిత్రం అత్యుత్తమ వసూళ్లను సాధిస్తున్నది.

ఆంధ్రాలో 3వ రోజు
ఇక అంధ్రాలోని ప్రధాన పట్టణాల విషయానికి వస్తే.. భీమవరంలో మూడో రోజు 7,97,985 రూపాయలు వసూలు చేసింది. ఇక అనంతపురంలో మూడో రోజు 13,99,528 రూపాయలు వసూలు చేయగా.. మొత్తం మూడు రోజుల్లో 38,04,932 వసూలు చేసింది. ఇక నెల్లూరులో మూడో రోజు 30 లక్షలు, మొత్త మూడు రోజుల్లో 1.15 కోట్లు రాబట్టింది.

ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలో
ఇక ఈస్ట్ గోదావరి జిల్లాలో మూడో రోజు F3 చిత్రం 57 లక్షల రూపాయలతో మొత్తం మూడో రోజుల్లో 1.81 కోట్లు వసూలు చేసింది. అలాగే వెస్ట్ గోదావరి జిల్లాలో 31.75 లక్షలతో గత మూడు రోజుల్లో 1.54 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక విజయవాడలో ఈ చిత్రం మూడో రోజున 9,27,457 లక్షలు రాబట్టింది.

నైజాంలో పరిస్థితి ఏమిటంటే?
ఇక నైజాంలో F3 చిత్రం భారీ వసూళ్లను రాబడుతున్నది. గత రెండు రోజుల్లో 4.09 కోట్లు జీఎస్టీతో కలిపి రాబట్టిన ఈ చిత్రం మూడో రోజున మరో 1.5 నుంచి 2 కోట్ల వరకు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. దాంతో ఈ చిత్రం మూడు రోజుల్లో 5 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.
Recommended Video


తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజు కలెక్షన్లు
ఇదిలా ఉండగా.. మూడో రోజు F3 చిత్రం 80 శాతానికిపైగా ఆక్యుపెన్సీతో మొదలైంది. దీంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసినట్టు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 9 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు తెలిసింది. గత రెండో రోజుల్లో 23.5 కోట్ల షేర్, 39.8 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో గత మూడో రోజుల్లో నైజాం, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలను కలిపి 14.15 కోట్ల గ్రాస్, రూ.8.85 కోట్ల షేర్‌ను రాబట్టింది.

F3 మూవీ లాభాల్లోకి రావాలంటే..
F3 మూవీ మూడో రోజుల్లో నైజాం, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలను కలిపి 27.55 కోట్ల షేర్, రూ.44.40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మూడు రోజుల్లో కర్నాటకలో 1.80 కోట్లు, ఓవర్సీస్‌లో 5.20 కోట్లు సాధించింది. దాంతో ఈ చిత్రం మూడు రోజుల్లో 34.55 కోట్ల షేర్, 58.05 కోట్ల గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అయితే చాలా చోట్లలో దిల్ రాజు స్వయంగా రిలీజ్ చేయడం వల్ల ఈ సినిమా బిజినెస్‌ను 64.5 కోట్లుగా అంచనావేశారు. ఆ లెక్క ప్రకారం ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా 30 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుందా? లేక నష్టాల్లోనే క్లోజ్ అవుతుందా? అనేది రానున్న మూడు రోజుల్లో తేలనున్నది.


Click it and Unblock the Notifications











