F3 movie day 4 collections నాలుగో రోజు భారీగా డ్రాప్.. ఇంకా ఎంత వసూలు చేస్తే లాభాల్లోకి అంటే?

టాలీవుడ్‌లో భారీ సక్సెస్ అందుకొన్న F2 చిత్రానికి ఫ్రాంచైజీగా వచ్చిన F3 చిత్రం గత మూడు రోజులుగా బ్రహ్మండమైన వసూళ్లను నమోదు చేసిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు స్ఫష్టం చేశాయి. అయితే తొలి వారాంతం తర్వాత ఈ చిత్రం మరింత పుంజుకొంటుందని ఆశించిన వారికి సోమవారం నిరాశే మిగిల్చింది. అయితే గత మూడు రోజులు సాధించిన కలెక్షన్లకు భిన్నంగా ఈ చిత్రం నాలుగో రోజున దారుణంగా డ్రాప్ అయింది. F3 సినిమా నాలుగో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

50 శాతానికి పైగా డ్రాప్

50 శాతానికి పైగా డ్రాప్

సినిమా పరిశ్రమలో సాధారణంగా తొలి వారాంతం తర్వాత ప్రతీ సోమవారం హెవీగా డ్రాప్ అవ్వడం మామూలే. అయితే థియేటర్లలో మూడు రోజుల్లో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం 4వ రోజున 50 శాతానికి పైగానే డ్రాప్ అయినట్టు సమాచారం. సోమవారం ఉదయం, మధ్యాహ్నం ఆటకు అక్యుపెన్సీ భారీగా పడిపోయింది. అయితే ఫస్ట్, సెకండ్ షోలకు ఫుల్స్ కావడంతో 4వ రోజు ఓ మోస్తారు కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

నైజాం, ఆంధ్రాలో కలెక్షన్లు

నైజాం, ఆంధ్రాలో కలెక్షన్లు


ఆంధ్రాలోని ప్రధాన పట్టణాల్లో ఓ మోస్తారు వసూళ్లను నమోదు చేసింది. కదిరిలో నాలుగో రోజు 1.25 లక్షలు, కర్నూలు సిటీ, నంద్యాల, భీమవరం, రాజమండ్రి, వైజాగ్‌, నైజాంలోని వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో 50 శాతం డ్రాప్ నమోదైనట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నైజాంలో గత మూడు రోజుల్లో 12.15 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం నాలుగో రోజున 1.5 కోట నుంచి 2 కోట్ల మధ్యన వసూలు చేసినట్టు సమాచారం.

4వ రోజున ఎంతంటే?

4వ రోజున ఎంతంటే?

F3 మూవీ నాలుగో రోజు నైజాంలో 2.04 కోట్లు, సీడెడ్ 68 లక్షలు, ఉత్తరాంధ్రలో 68 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 34 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 19 లక్షలు, గుంటూరు జిల్లాలో 28 లక్షలు, కృష్ణా జిల్లాలో 28 లక్షలు, నెల్లూరు జిల్లాలో 19 లక్షలు వసూలు చేసింది. దాంతో నాలుగో రోజున 4.68 కోట్లు, 7.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

అమెరికాలో 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో

అమెరికాలో 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో

అమెరికాలో F3 చిత్రం నాలుగో రోజున ఓ మైలురాయిని దాటింది. ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో భారీగా వసూళ్లు సాధించిన చిత్రం నాలుగో రోజు 125k రాబట్టింది. దాంతో ఈ చిత్రం మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. గత నాలుగు రోజుల్లో 1,073,369 అమెరికన్ డాలర్ల వసూళ్లను నమోదు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో 32.23 కోట్ల షేర్, 51.65 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 2.02 కోట్లు, ఓవర్సీస్‌లో 5.70 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 39.95 కోట్ల షేర్, 66.70 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

F3 సినిమా లాభాల్లోకి రావాలంటే?

F3 సినిమా లాభాల్లోకి రావాలంటే?


F3 చిత్రం గత నాలుగు రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే.. బ్రేక్ ఈవెన్ సాధించడానికి ఈ సినిమా ముందు భారీ లక్ష్యమే కనబడుతున్నది. రానున్న రోజుల్లో సుమారు మరో 25 కోట్లు రాబట్ట గలిగితే.. ఈ సినిమా లాభాల జోన్‌లోకి ప్రవేశించే అవకాశం కనిపిస్తున్నది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అనే విషయాన్ని వేచి చూడాల్సిందే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X