twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    F3 movie day 6 collections బాక్సాఫీస్ వద్ద భారీ దెబ్బ.. ఇంకా నష్టాల్లోనే.. F3 కలెక్షన్లు ఎంతంటే?

    |

    భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన F3 చిత్రం రెండో వారంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. అయితే తొలి మూడు రోజుల్లో మంచి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం వారాంతం తర్వాత బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. అయితే సుమారు 65 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించిన ఈ చిత్రం 6వ రోజు ఏ మేరకు వసూళ్లను సాధించిందంటే?

    ప్రధాన పట్టణాల్లో కలెక్షన్లు

    ప్రధాన పట్టణాల్లో కలెక్షన్లు

    తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాల్లో వసూళ్ల విషయానికి వస్తే.. కర్నూలు సిటీలో 6వ రోజున 5 లక్షల గ్రాస్‌తోపాటు గత 6 రోజుల్లో మొత్తంగా 70 లక్షల గ్రాస్‌ను సాధించింది. అమలాపురంలో 1.5 లక్షలతో మొత్తంగా 17.5 లక్షలు, కదిరి టౌన్‌లో 81 వేలు మొత్తంగా 8.7 లక్షల గ్రాస్, భీమవరంలో 3.2 లక్షలతో మొత్తంగా 34.5 లక్షల గ్రాస్ సాధించింది. ఇక అనంతపురంలో ఆరో రోజున 4 లక్షలతో మొత్తంగా 54 లక్షల గ్రాస్ వసూలు చేసింది.

    ప్రాంతాల వారీగా వసూళ్లు

    ప్రాంతాల వారీగా వసూళ్లు

    ఇక F3 చిత్రం నంద్యాలలో ఆరో రోజున 2.4 లక్షలతో మొత్తంగా 31 లక్షల గ్రాస్ నమోదు చేసింది. ఇక వైజాగ్‌లో 9 లక్షలు, వరంగల్‌లో 3 లక్షలు, విజయవాడలో 4 లక్షలు, నిజమాబాద్‌లో 70 వేలు, రాజమండ్రిలో 3 లక్షలు, కాకినాడలో 2 లక్షలు, తిరుపతిలో 1 లక్ష రూపాయలు, గుంటూరులో 3 లక్షలు, ఏలూరులో 1 లక్ష వసూలు చేసింది.

    నైజాం, ఆంధ్రాలో 6వ రోజు

    నైజాం, ఆంధ్రాలో 6వ రోజు

    ఇక నైజాం, ఆంధ్రాలో F3 సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 62 లక్షలు, సీడెడ్‌లో 36 లక్షలు, ఉత్తరాంధ్రలో 34 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 20 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 12 లక్షలు, గుంటూరు జిల్లాలో 14 లక్షలు, కృష్ణా జిల్లాలో 13 లక్షలు, నెల్లూరు జిల్లాలో 7 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 6వ రోజున 1.98 కోట్ల షేర్, 3.20 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

    కర్ణాటక, చెన్నైలో

    కర్ణాటక, చెన్నైలో

    ఇక తెలుగు రాష్ట్రాలేతర ప్రాంతాల విషయానికి వస్తే.. గత ఐదు రోజుల్లో 2.55 కోట్ల వసూళ్లను సాధిస్తే.. ఆరో రోజున 8 లక్షలు, చెన్నైలో 3 లక్షల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం కర్ణాటక, తమిళనాడులో 2.61 కోట్లు రాబట్టింది.

    6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా

    6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా

    ఇక ప్రపంచవ్యాప్తంగా F3 చిత్రానికి సంబంధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఏపీ, తెలంగాణలో గత 6 రోజుల్లో 37.30 కోట్ల షేర్, 53.75 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కర్ణాటకలో 2.61 కోట్లు, ఓవర్సీస్‌లో 6.55 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 46.40 కోట్ల షేర్, 77.35 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    6వ రోజు తర్వాత ఎంత నష్టమంటే?

    6వ రోజు తర్వాత ఎంత నష్టమంటే?

    F3 చిత్రం మొత్తంగా 64 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 65 కోట్లు బిజినెస్ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 46.4 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇంకా ఈ చిత్రం 19 కోట్లు రాబట్టగలిగితే.. లాభాల్లోకి ప్రవేశించే ఛాన్స్ ఉంది.

    English summary
    Venkatesh, Varun Sandesh's F3 movie day 6 collections look solid in all over world. It collected 46 crore share and 77 crore gross.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X