Premalu 3 days Collections 4 కోట్ల బడ్జెట్.. దుమ్మురేపుతున్న ఫాహద్ ఫాజిల్ మూవీ.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నిర్మాతగా మారి రూపొందించిన యూత్‌పుల్, రొమాంటిక్ లవ్ స్టోరి ప్రేమలు. ఈ చిత్రంలో నస్లేన్, మమితా, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ నటించారు. భావన స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చేస్తున్న సందడి, వసూలు చేస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
నూతన నటీనటులు, యువ హీరో, హీరోయిన్లు, సాంకేతిక నిపుణులతో రూపొందించిన ప్రేమలు చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌తో రూపొందించారు. అన్ని ఖర్చులు, రెమ్యునరేషన్లతో కలిపి ఈ సినిమాను 4 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను ప్రస్తుతం మలయాళ భాషలోనే రిలీజ్ చేశారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు.

హైదరాబాద్, తెలుగు, మలయాళ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ప్రేమలు మూవీ ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్‌కు భారీగా ఆదరణ దక్కడంతో ఈ సినిమాను మలయాళంలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాను ప్రేమికుల రోజు వాలంటైన్ డే కానుకగా ప్రేక్షకులకు అందించారు. ఈ సినిమాను మలయాళంలో 250 స్క్రీన్లలో ప్రధాన నగరాల్లో 50 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు.
కేరళలో ప్రేమలు సినిమాకు మంచి రెస్పాన్స్ యూత్ నుంచి వస్తున్నది. ఈ సినిమా తొలి రోజు 1 కోటి రూపాయల నెట్ కలెక్షన్లు నమోదు చేసింది. ఇక రెండో రోజు 100 శాతం వృత్తిని సాధించి 2 కోట్ల రూపాయలు నికరంగా వసూలు చేసింది. దాంతో కేవలం రెండు రోజుల్లోనే 3 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లను రాబట్టింది.
ఇక ప్రేమలు సినిమా బాక్సాఫీస్ వద్ద గ్రోత్ ఎలా ఉంంటే.. తొలి రోజు కంటే రెండో రోజు.. రెండో రోజు కంటే మూడో రోజు కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి. ఈ చిత్రానికి కోచి, త్రిచూర్, చెన్నై, బెంగళూరు, కొల్లాం, కొట్టాయం, హైదరాబాద్‌లో 75 శాతం కంటె అధికంగా ఆక్యుపెన్సీ కనిపించింది. కేరళలోని ఇతర ప్రధాన పట్టణాల్లో 60 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు అవుతున్నాయి.

ఇక ప్రేమలు మూవీ 3వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ఆదివారం భారీ కలెక్షన్లు రాబడుతున్నది. ఈ సినిమా సుమారుగా 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే 6 కోట్ల రూపాయలు వరకు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 3 రోజే బ్రేక్ ఈవెన్ సాధించినట్టు అయింది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











