Family Star Day 2 Collections: విజయ్ దేవరకొండ మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. ఫ్యామిలీ స్టార్‌కు ఎన్ని కోట్లంటే!
విజయ్ దేవరకొండ, మృణాల్ థాకూర్ జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరి ది ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా గీతా గోవిందం లాంటి హిట్ అందించిన పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషల్లో రిలీజైంది. ఈ చిత్రం రిలీజ్ తర్వాత భారీగా కలెక్షన్లు రాబడుతున్నది. అయితే గత రెండు రోజుల్లో ఈ సినిమా వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, అమెరికా బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని చాలా రిచ్‌గా తెరకెక్కించారు. యూఎస్‌లో అందమైన ప్రదేశాల్లో షూట్ చేశారు. దాంతో ఈ సినిమాకు భారీగా ఖర్చు చేశారు. అయితే సినిమాను సుమారుగా 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తీర్చిదిద్దారు. ఇక ఈ మూవీ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. తెలుగు రాష్ట్రాలతోపాటు వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 44 కోట్ల రూపాయల మేర జరిగింది.

విజయ్ దేవరకొండకు యూత్, ఫ్యామిలీ వర్గాల్లో ఉన్న ఫాలోయింగ్, డిమాండ్‌తో ఈ మూవీని భారీగా, గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 1800 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక తొలి రోజు ఈ సినిమాకు 60 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. మిక్స్ డ్ రివ్యూల కారణంగా, ఐపీఎల్ టోర్నీ కారణంగా అనుకొన్నంతగా ఈ సినిమా వసూళ్లను రాబట్టలేకపోయిందని పేర్కొన్నారు.
అమెరికాలో ది ఫ్యామిలీ స్టార్ చిత్రానికి మంచి స్పందన వ్యక్తమవుతున్నది. ప్రీమియర్స్, తొలి రోజు వసూళ్లు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా నార్త్ అమెరికాలో సుమారుగా 500K డాలర్లను వసూలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 4.2 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే.. వారాంతంలో బ్రేక్ ఈవెన్‌కు చేరువయ్యే అవకాశం ఉంది.

తొలి రోజు తెలుగు రాష్ట్రాలు, ఇతర స్టేట్స్‌లో ఈ సినిమా వసూళ్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 5 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇండియాలో అంటే.. తెలుగు, తమిళంలో కలిపి ఈ చిత్రం 6 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. మొత్తంగా ఈ చిత్రం సుమారుగా 11 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఆంధ్రా, నైజాం, కర్ణాటక, తమిళ రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 3 కోట్ల నికరంగా, 4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ 250K అంటే.. 2 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా సుమారుగా 6 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











