Family Star Day 3 Collections: విజయ్ దేవరకొండ మూవీ ఊహించని వసూళ్లు.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, టాలీవుడ్ లక్కీ మస్కట్ మృణాల్ థాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గత మూడు రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. .
విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాను ఖర్చుకు వెనుకాడకుండా విదేశాల్లో నిర్మించారు. అమెరికాలోను, ఇతర ప్రాంతాల్లోను రిచ్‌గా తెరకెక్కించడంతో ఈ సినిమా బడ్జెట్ 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 44 కోట్ల మేర జరిగింది. ఇక ఈ సినిమాను 1700 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

గత చిత్రాలతో పోల్చుకొంటే విజయ్ దేవరకొండ నటించిన ఈ మూవీకి పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. కానీ తొలి రోజు మాత్రం బెటర్ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా తొలి రోజు ఆంధ్రా, నైజాంలో 6.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 500K డాలర్లు అంటే.. ఇండియన్ కరెన్సీలో 4.5 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో 1 కోటి మేర వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 12 కోట్లకు మేర కలెక్షన్లు రాబట్టింది.
ఇక రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...నిలకడగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా రెండు రోజుల్లో కలిపి అమెరికాలో 700K డాలర్లు, ఇతర దేశాల్లో 300K డాలర్లు కలిపి ఓవర్సీస్‌లో మొత్తంగా 1 మిలియన్ డాలర్లు అంటే 8.5 కోట్లు వసూలు చేసింది.ఇక ఏపీ, నైజాంలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా రెండో రోజు 8 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది.

ఇక మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం 2.5 కోట్ల తెలుగు రాష్ట్రాల్లో, తమిళంలో 25 లక్షల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్‌లో 300K డాలర్లు అంటే 25 లక్షల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది. దాంతో మూడో రోజు ఈ సినిమా 3 నుంచి 3.5 కోట్ల మధ్య వసూళ్లను నమోదు చేస్తుందని వెల్లడించారు.
ఇక గత మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 12 కోట్లు, రెండో రోజు 8 కోట్ల రూపాయలు, మూడో రోజు 3.5 కోట్ల రూపాయలు నమోదు చేసింది. దాంతో మూడు రోజుల్లో మొత్తంగా 23 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 45 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











