Family Star 4 Days Collections విజయ్ దేవరకొండకు కోలుకోలేని దెబ్బ.. ఫ్యామిలీ స్టార్ నష్టాల్లో నుంచి బయటపడాలంటే?

ప్రముఖ నిర్మాత దిల్ రాజు, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురి అవుతున్నది. ఈ సినిమా రిలీజ్ తర్వాత భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాపై జరిగిన దుష్ప్రచారంతో కలెక్షన్లపై భారీ దెబ్బ పడుతున్నది. ఈ సినిమా మూడు రోజుల్లో మంచి వసూళ్లు నమోదు చేసిన ఈ చిత్రం నాలుగో రోజు పేలవమైన కలెక్షన్లు రాబట్టింది. ఈ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఫ్యామిలీ స్టార్ సినిమా విషయానికి వస్తే.. 60 కోట్ల రూపాయల బడ్జెట్ రూపొందించారు. ఈ సినిమా బిజినెస్ 44 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఈ మూవీని సుమారుగా 1700 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అంచనాల మేరకు లేదనే కామెంట్లు సోష్ మీడియాలో భారీగా కనిపించాయి.

Family Star Day 4 expected Box Office Collections worldwide Vijay Deverakonda movie drops heavily

ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ తెలుగులో 5.55 కోట్లు, తమిళంలో 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో తొలి రోజు ఇండియా వైడ్ 5.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో రోజు విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్లకుపైగా, తమిళనాడులో 40 లక్షల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 3.4 కోట్ల రూపాయలు వసూలుచేసింది.

ఇక మూడో రోజు కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఆంధ్రా, నైజాంలో 3 కోట్ల రూపాయలు, తమిళంలో 40 లక్షల రూాపయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 3 కోట్లకుపైగా కలెక్షన్లు ాసధించింది. ఈ చిత్రం మూడు రోజుల్లో 12 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.

Family Star Day 4 expected Box Office Collections worldwide Vijay Deverakonda movie drops heavily

ఇక ఫ్యామిలీ స్టార్ చిత్రం నాలుగో రోజు అంటే సోమవారం అగ్నిపరీక్షగా మారింది. ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఈ సినిమా 4వ రోజు ఇండియా వైడ్‌గా 1.5 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా మూడు రోజు 12 కోట్లు, నాలుగో రోజు 1.5 కోట్లతో ఇండియాలో 13.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం సుమారుగా 19 కోట్ల రూపాయలు వసూలుచేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 45 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X