FAMILY STAR: యూఎస్‌లో షాకింగ్ కలెక్షన్లు.. ఫ్యామిలీ స్టార్‌కు ఎన్ని కోట్లు వచ్చాయంటే!

తెలుగు చిత్ర సీమలోకి ఎంతో మంది హీరోలు వస్తున్నా.. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటూ స్టార్లుగా మారుతున్నారు. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ ఒకడు. మొదట్లోనే ఎన్నో హిట్ చిత్రాలను అందుకున్న అతడు.. మార్కెట్‌ను భారీ స్థాయిలో పెంచుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం వరుసగా షాక్‌లను ఎదుర్కొంటోన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' అనే సినిమాతో వచ్చాడు. దీనికి యూఎస్‌లో వేసిన ప్రీమియర్స్‌లో ఊహించని వసూళ్లు వచ్చాయి. ఆ వివరాలు మీకోసం!

ఫ్యామిలీ స్టార్ వచ్చేశాడు:విజయ్ దేవరకొండ - పరశురాం కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'ఫ్యామిలీ స్టార్'. ఫ్యామిలీ స్టోరీతో వచ్చిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా చేశారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు.

FAMILY STAR Movie Crossed 200K Dollar Mark in USA Premiere Advance Sales

ఫ్యామిలీ స్టార్ టాక్ ఇలా:విజయ్ దేవరకొండ నటించిన 'ఫ్యామిలీ స్టార్' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో దీనికి డీసెంట్ టాక్ వచ్చింది. ఫలితంగా మొదటి రోజు థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగానే అవుతున్నాయి. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు మంచిగానే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఓవర్సీస్‌లోనూ డీసెంట్‌:మిగిలిన ఏరియాలతో పోల్చుకుంటే ఓవర్సీస్‌లో 'ఫ్యామిలీ స్టార్' మూవీ సందడి మరింత ముందుగానే ప్రారంభం అయింది. అక్కడ ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ చాలా రోజుల ముందే ఓపెన్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే యూఎస్, కెనడాలో చాలా టికెట్లు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమాకు నార్త్ అమెరికాలోనే మంచి స్పందనే లభిస్తోంది.

FAMILY STAR Movie Crossed 200K Dollar Mark in USA Premiere Advance Sales

విజయ్ కెరీర్‌లోనే టాప్:విజయ్ దేవరకొండ నటించిన 'ఫ్యామిలీ స్టార్' మూవీ రిలీజ్ ఏప్రిల్ 5వ తేదీన ఉండడంతో ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అక్కడ ఈ చిత్రాన్ని గతంలో విజయ్ సినిమాల కంటే గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అనుకున్నట్లే యూఎస్‌లో ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వస్తోంది. ఫలితంగా ప్రీమియర్స్ అన్నీ సూపర్ హిట్ అయిపోయాయి.

ఆ మార్కును దాటింది:పరశురాం పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'ఫ్యామిలీ స్టార్' మూవీకి యూఎస్‌లో అడ్వాన్స్ సేల్స్ ద్వారా మంచి వసూళ్లు లభిస్తున్నాయి. ఫలితంగా ఈ చిత్రం ప్రీమియర్స్ ద్వారా 200K డాలర్ల మార్కును దాటేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 1.66 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. అలాగే 400K దిశగా ఈ మూవీ సాగిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X