FAMILY STAR: విజయ్ దేవరకొండ రికార్డు.. ఊహించని రేటుకు ఫ్యామిలీ స్టార్ రైట్స్
ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిపోయాడు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను అందుకున్న అతడు.. చాలా కాలంగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా 'లైగర్' అతడి ప్రయాణంలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలవగా.. 'ఖుషి' కూడా నష్టాలతోనే రన్‌ను ముగించింది. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో విజయ్ దేవరకొండ ముందుకు సాగిపోతున్నాడు.
ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసే విజయ్ దేవరకొండ ఇప్పుడు తన 13వ చిత్రాన్ని పరశురాం పెట్లతో చేస్తున్నాడు. హిట్ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీనికి 'ఫ్యామిలీ స్టార్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసుకున్నారు. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం అక్టోబర్ 18న విడుదల కాబోయే గ్లింప్స్ వీడియోలో రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి.. సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.

హిట్ కాంబినేషన్‌లో రాబోతున్న 'ఫ్యామిలీ స్టార్' మూవీ రిలీజ్ పొంగల్‌కే అని నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో పాటు బిజినెస్ కూడా మొదలు పెట్టేశారు. ఇందులో భాగంగానే తాజాగా విజయ్ దేవరకొండ మూవీకి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ డీల్ క్లోజ్ అయినట్లు తెలిసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'ఫ్యామిలీ స్టార్' ఓవర్సీస్ హక్కులు రూ. 8 కోట్లకు అమ్ముడుపోయాయట. అందులో యూఎస్ ఒక్కటే రూ. 5.50 కోట్లు పలికినట్లు తెలిసింది. మొత్తంగా ఈ చిత్రం 1.8 మిలియన్ డాలర్ల టార్గెట్‌తో రాబోతుందని అంటున్నారు.
విజయ్ దేవరకొండ - పరశురాం పెట్ల కలిసి చేస్తున్న 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ చిత్రం ఎక్కువ శాతం విదేశాల్లోనే షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











