Family Star Closing Collections.. ఫ్యామిలీ స్టార్ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి? విజయ్ దేవరకొండ మూవీకి లాభమా?

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం ది ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ, మృణాళ్ థాకూర్ జంటగా నటించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసింది. యువ దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? కలెక్షన్ల వివరాలు ఎంత అనే వివరాల్లోకి వెళితే..

ది ఫ్యామిలీ స్టార్ సినిమా స్క్రిప్టు డిమాండ్ మేరకు ఈ మూవీని అమెరికా, ఇతర దేశాల్లో చిత్రీకరించారు. ఈ సినిమాకు భారీగా ప్రమోషనల్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. ఇక ఈ సినిమా ఆర్టిస్టులు సాంకేతిక నిపుణులు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా ఈ సినిమాను 60 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Family Star Telugu Movie Closing Collections Worldwide Vijay Deverakonda Cinema Box Office Result is here

ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. థియేట్రికల్ హక్కులు మంచి రేటుకు అమ్ముడుపోయాయి. నైజాం ఏరియా హక్కులు 14 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 4.5 కోట్లు, ఆంధ్రా 17 కోట్ల రూపాయలతో కలిపి మొత్తంగా 34 కోట్లకుపైగా థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలెక్షన్లు కలిపి 8 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా బిజినెస్ మొత్తంగా 44 కోట్ల రూపాయల మేర జరిగింది.

ఇక ది ఫ్యామిలీ స్టార్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఏపీ, తెలంగాణలో తొలి రోజు 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు 3 కోట్ల రూపాయలు, మూడో రోజు 4 కోట్ల రూపాయలు, ఐదో రోజు 3 కోట్ల రూపాయలు, 6వ రోజు 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల రూపాయలు వసూలుచేసింది.

ఇక ఓవర్సీస్‌లో ఈ మూవీ దాదాపు బ్రేక్ ఈవెన్ సాధించింది. 5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగితే.. ఈ సినిమా 10 కోట్ల రూపాయలు కలెక్షన్లను సాధించడం విశేషంగా మారింది. ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా వసూళ్లను సాధిస్తున్నది.

Family Star Telugu Movie Closing Collections Worldwide Vijay Deverakonda Cinema Box Office Result is here

ఇప్పటి వరకు ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 21 కోట్ల షేర్, 30 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయలు మేర కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో రెండు వారాంతంలో ఈ సినిమా సుమారుగా 40 కోట్ల వసూళ్లతో క్లోజ్ కలెక్షన్లను నమోదు చేసింది. ఇంకా ఫైనల్‌గా ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లను వసూలు చేస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X