ఈ సినిమా కూడా డిజాస్టరేనా?... కంటిన్యూ అవుతున్న వరుస ప్లాప్స్!
ఐశ్వర్య రాయ్ కూతురు పుట్టిన తర్వాత కొంతగ్యాప్ తీసుకుని మళ్లీ బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నా... సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. అయితే రీ ఎంట్రీ తర్వాత ఆమెకు వరుస ప్లాపులు ఎదురవ్వడం అభిమానులను నిరాశ పరుస్తోంది. ఆరాధ్య పుట్టిన తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న ఐష్ 'జజ్బా' సినిమాలో నటించింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. ఆ తర్వాత చేసిన 'సరబ్జీత్' కూడా బాక్సాఫీసు రేసులో ఓడిపోయింది. తాజాగా ఐశ్వర్యరాయ్ నటించిన 'ఫన్నే ఖాన్' సైతం నిర్మాతలకు నిరాశ మిగిల్చింది.

ఐశ్వర్యరాయ్ లుక్, వయసు కారణం కాదు
లుక్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఐశ్వర్య రాయ్ అప్పుడు, ఇప్పుడు ది బెస్ట్ అని నిరూపించుకుంది. రీ ఎంట్రీ తర్వాత ఆమె నటించిన సినిమాల్లోనూ అందం పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. అయితే సినిమాలు ఆడక పోవడానికి కారణం ఆమె ఉంచుకుంటున్న పాత్రలే అంటున్నారు విశ్లేషకులు.

ఫన్నే ఖాన్ కోసం చాలా కష్టపడింది
ఫన్నే ఖాన్ సినిమా కోసం ఐశ్వర్యరాయ్ చాలా కష్టపడింది. ముఖ్యంగా లుక్ విషయంలో, పెర్ఫార్మెన్స్ విషయంలో గత సినిమాల కంటే కొత్తగా కనిపించేందుకు చాలా వర్కౌట్స్ చేసింది. కానీ సినిమాలో ఆమె పాత్ర మలిచిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోక పోవడమే కారణమని స్పష్టమవుతోంది.

ఫన్నే ఖాన్‌లో మైనస్ అదే
ఫన్నే ఖాన్ మూవీ కథ బావున్నప్పటికీ స్క్రీన్ ప్లేలో ఎమోషనల్ డెప్త్ లేదని, ఐశ్వర్యరాయ్ పాత్రను ప్రొజెక్ట్ చేసిన తీరు కూడా అంత గొప్పగా లేదని. ప్రేక్షకులను ఆకట్టుకోక పోవడానికి కారణం అదే అని అంటున్నారు.

ఐశ్వర్యరాయ్ సినిమాల కలెక్షన్స్
ఫన్నే ఖాన్: రూ. 9 కోట్లు (ఫస్ట్ వీక్ కలెక్షన్)
సరబ్జీత్: మొత్తం రూ. 33 కోట్లు
జజ్బా: మొత్తం రూ. 31 కోట్లు


Click it and Unblock the Notifications











