Fast X day 1 collections ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10 రికార్డు కలెక్షన్లు.. తొలి రోజు ఎన్ని వేల కోట్లంటే?

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న Fast and /Furious చిత్రం 10వ సీక్వెల్ మే 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విన్ డీజిల్, జాసన్ మోమో, జాన్ సెనా, బ్రై లార్సన్, చార్లీజ్ తెరాన్ తదితరులు నటించిన Fast X (Fast and /Furious 10) చిత్రం భారీ క్రేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూనివర్సల్ పిక్చర్స్, ఓరిజినల్ ఫిల్మ్, వన్ రేస్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఫాస్ట్ 10 బడ్జెట్, స్క్రీన్ కౌంట్: Fast X (Fast and Furious 10) సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను మొత్తంగా 340 మిలియన్ డాలర్ల బడ్జెట్ అంటే.. భారతీయ కరెన్సీలో 2808 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ చిత్రాన్ని ఇండియాలో 2200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇటీవల కాలంలో ఈ రేంజ్ స్క్రీన్లలో రిలీజైన హాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

Fast X day 1 expected collections worldwide: Vin Diesels movie starts high note at box office

ఇండియాలో ఫాస్ట్ 10 ఆక్యుపెన్సీ: Fast X (Fast and Furious 10) చిత్రం హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ భాషల్లో 3డీ, 2డీ ఫార్మాట్‌తోపాటు ఐమాక్స్ 3డీ, 4డీఎక్స్ 3డీ ఫార్మాట్‌లో విడుదలైంది. ఇంగ్లీష్ వెర్షన్ 4డీఎక్స్ 3డీకు మంచి ఆదరణ లభించింది. హిందీ 3డీ వెర్షన్‌కు 20 శాతం ఆక్యుపెన్సీ, ఐమాక్స్ 3డీ వెర్సన్‌కు 25 శాతం ఆక్యుపెన్సీ, ఇంగ్లీష్ 4డీఎక్స్ 3డీ ఫార్మాట్‌కు 60 శాతం ఆక్యుపెన్సీ, తెలుగు 3డీ వెర్షన్‌కు 25 శాతం ఆక్యుపెన్సీ, తెలుగు 3డీ వెర్షన్‌కు 22 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

Fast X day 1 expected collections worldwide: Vin Diesels movie starts high note at box office

గత సిరీస్‌ల కలెక్షన్లు: Fast X (Fast and Furious 10) గత సీరీస్‌ల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. Fast and Furious 7 తొలి రోజు 12 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. Fast and Furious 8 తొలి రోజు 9.5 కోట్లు రాబట్టింది. Fast and Furious 9 సుమారు 9 కోట్ల మేర వసూళ్లను సాధించింది. దాంతో ఈ సినిమా తొలి రోజు ఎంత వసూలు చేస్తుందనే విషయం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.

Fast X day 1 expected collections worldwide: Vin Diesels movie starts high note at box office

ఇండియాలో తొలి రోజు కలెక్షన్లు: Fast X (Fast and Furious 10) చిత్రం ఇండియాలో తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం 12 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గత నాలుగు సిరీస్‌లతో పోల్చుకొంటే Fast X (Fast and Furious 10) భారీ వసూళ్లను సాధించే ఛాన్స్ కనిపిస్తున్నది.

Fast X day 1 expected collections worldwide: Vin Diesels movie starts high note at box office

ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్ అంొడ్ ఫ్యూరియస్ కలెక్షన్లు: Fast X (Fast and Furious 10) సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం చైనా, కోరియాలో భారీ వసూళ్లు నమోదయ్యాయి. ఈ చిత్రం తొలి రోజు 19 మిలియన్ డాలర్లు రాబట్టిందనే వెల్లడించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా తొలి వారాంతంలో అమెరికాలో 60 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక అమెరికా మినహాయించి ఇతర దేశాల్లో 230 మిలియన్ డాలర్లు అంటే సుమారు 2400 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X