Fast X collections ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10కు 1500 కోట్లు వసూళ్లు.. ఇండియాలో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ (Fast and Furious) ఫ్రాంచైజీలో భాగంగా తాజాగా వచ్చిన 10 ఎడిషన్ Fast X (Fast and Furious 10) చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తున్నది. విన్ డీజిల్, జాసన్ మోమో, జాన్ సెనా, బ్రై లార్సన్, చార్లీజ్ తెరాన్ తదితరులు నటించిన బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను సాధిస్తున్నది. తొలి రోజు భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం గత మూడు రోజులుగా నిలకడగా కలెక్షన్లను సాధిస్తున్నది. 3వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Fast X (Fast and Furious 10) చిత్రం తొలి రోజున ఇండియాలో భారీ వసూళ్లను నమోదు చేసింది. ఇంగ్లీష్ వెర్షన్ 5.85 కోట్లు, హిందీ 5.6 కోట్లు, తెలుగు వెర్షన్ 55 లక్షలు, తమిళ వెర్షన్ 5 లక్షలు వసూలు చేసింది. దాంతో తొలి రోజు ఇండియాలో 12.5 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఇటీవల రిలీజైన హాలీవుడ్ చిత్రాల్లో బెటర్ కలెక్షన్లను రాబట్టింది.

 Fast X collections

Fast X (Fast and Furious 10) చిత్రం రెండో రోజున కూడా భారీ కలెక్షన్లను నమోదు చేసింది. తొలి రోజు కంటే ఎక్కువగా వసూళ్లను రాబట్టింది. ఇంగ్లీష్ వెర్షన్ 6.55 కోట్ల రూపాయలు, హిందీ వెర్షన్ 6.35 కోట్లు, తెలుగులో 35 లక్షలు, తమిళంలో 35 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 13.6 కోట్లు వసూళ్లను రాబట్టింది.

 Fast X collections

Fast X (Fast and Furious 10) చిత్రం తొలి రెండు రోజుల కంటే 3వ రోజు భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇంగ్లీష్ వెర్షన్ 8.25 కోట్లు, హిందీ వెర్షన్ 7.1 కోట్ల రూపాయలు, తెలుగు 30 లక్షల రూపాయలు, తమిళంలో 55 లక్షల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 16.5 కోట్లు రాబట్టింది.

 Fast X collections

Fast X (Fast and Furious 10) చిత్రం తొలి రోజు 12.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 13.6 కోట్ల రూపాయలు, మూడో రోజు 16.5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 42 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. తెలుగు, తమిళ వెర్షన్లు బలహీనంగా కలెక్షన్లను రాబడుతుండటంతో గొప్పగా ఇండియాలో కలెక్షన్లు నమోదు కాలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

 Fast X collections

Fast X (Fast and Furious 10) చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇప్పటి వరకు 1500 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇండియాలో 42 కోట్లకుపైగా షేర్, 50 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో అమెరికా, కెనడా మినహాయించి 700 కోట్లు రాబట్టింది. రానున్న రోజుల్లో మరిన్నీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X