Animal Vs Sam Bahadur షాకింగ్‌గా సామ్ బహద్దూర్ కలెక్షన్లు.. యానిమల్ మూవీతో పోటినా?

బాలీవుడ్‌లో డిసెంబర్ తొలివారంలో రెండు భారీ సినిమాలు భారీ పోటికి తెర లేపాయి. డిసెంబర్ 1వ తేదీన సందీప్ రెడ్డి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ నటించిన యానిమల్, వికీ కౌశల్ నటించిన సామ్ బహద్దూర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజయ్యాయి. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

సామ్ బహద్దూర్ సినిమా విషయానికి వస్తే.. ఇండియాలో తొలి ఫీల్డ్ మార్షల్, లెజెండరీ ఆర్మీ జనరల్ సామ్ హెచ్ఎఫ్ మాణిక్ షా జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో మాణిక్ షా భార్యగా సాన్య మల్హోత్రా, ఇందిరా గాంధీ పాత్రలో ఫాతిమా సనా షేక్, జవహర్ లాల్ నెహ్రూగా నీరజ్ కాబీ, లార్డ్ మౌంట్ బ్యాటెన్‌టా ఎడ్వార్డ్ సానెన్ బ్లిక్, సర్దార్ వల్లభాయ్ పటేల్‌గా గోవింద్ నామ్‌దేవ్ నటించారు.

 Fatima Sana Shaikhs Sam Bahadur Collections: Vicky Kaushal movie slow start at Box office

ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ దర్వకత్వంలో రూపొందిన సామ్ బహద్దూర్ చిత్రాన్ని సుమారు 55 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను ఇండియాలో 1800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా 65 కోట్లుగా ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

అయితే సామ్ బహద్దూర్ సినిమా రిలీజ్ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. సాధారణ ప్రేక్షకులు, సినీ విమర్శకులు ఈ మూవీపై పెదవి విరిచారు. దాంతో ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో జర్నీని ప్రారంభించింది. ఈ సినిమా నేషనల్ మల్టీప్లెక్స్‌లో 60 వేల టికెట్లు మాత్రమే అమ్మగలిగారు. దాంతో కేవలం 2 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదు చేశాయి.

వికీ కౌశల్ కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన సామ్ బహద్దూర్ తొలి రోజు భారీగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ సినిమా తోలి రోజు ఇండియావైడ్‌గా 6.25 కోట్ల నెట్, 9 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ముందు భారీ లక్ష్యమే ఉందనే ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

 Fatima Sana Shaikhs Sam Bahadur Collections: Vicky Kaushal movie slow start at Box office

ఇదిలా ఉండగా, యానిమల్ సినిమాకు భారీ రెస్పాన్స్ లభిస్తున్నది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. రణ్‌బీర్ కపూర్ నటించిన ఈ సినిమా తొలి రోజే 116 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. ఇక గట్టిపోటీ ఇస్తుందని భావించిన సామ్ బహద్దూర్ చిత్రం కేవలం 9 కోట్ల మేర మాత్రమే కలెక్షన్లు రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X