Fighter Collections ఫైటర్ కలెక్షన్లు షాకింగ్‌గా.. 210 కోట్ల టార్గెట్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

బాలీవుడ్ సూపర్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపిక పదుకోన్ జంటగా పాపులర్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఫైటర్. వయోకామ్ 18 బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో అనిల్ కపూర్ తదితరులు నటించారు. మమతా ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అంకు పాండే నిర్మించిన మూవీకి విశాల్, శేఖర్, చిత్ బల్హారా సంగీతం అందించారు. సస్పెన్స్ థ్రిల్లర్, దేశభక్తి తదితర అంశాలతో రూపొందిన ఈ సినిమా జనవరి 15వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

అశుతోష్ రాణా, తెలుగు నటుడు వినయ్ వర్మ, కరణ్ సింగ్ గ్రోవర్, రిషబ్ స్వానీ లాంటి తారలు, పాపులర్ టెక్నిషియన్స్ ఈ సినిమాకు పనిచేయడంతో భారీ బడ్జెట్‌తో రూపొందించారు. యాక్టర్లు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను 200 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు.

Fighter-Collections-Worldwide

ఇక ఫైటర్ సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్ేత.. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజెనెస్‌ను 200 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 210 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది.

ఫైటర్ సినిమాను 2D, 3D, 3D PCX, Imax 3D వెర్షన్లలో రిలీజ్ చేశారు. 3డీ వెర్షన్స్‌కు భారీ ఆక్యుపెన్సీ నమోదు అయింది.3డీ ఐమాక్స్ వెర్షన్‌ విషయానికి వస్తే.. మార్నింగ్ షోకు 30 శాతం, మ్యాట్నీకి 35 శాతం, ఫస్ట్ షోకు 55 శాతం, సెకండ్ షోకు 55 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. 2డీ, 3డీ వెర్షన్ పెద్దగా ఆక్యుపెన్సీ నమోదు కాలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఫైటర్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇండియాలో మంచి రెస్పాన్స్ కనిపించింది. ఈ సినిమా అన్ని వెర్షన్లలో కలిపి ఇండియాలో 20 కోట్లకుపైగా నెట్, 30 కోట్ల రూపాయలకుపైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్‌గా 40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకావ: ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X