ఫేక్ బాక్సాఫీస్ కలెక్షన్స్ కలకలం.. బ్లాక్ బస్టర్ నిర్మాత దివాలా?

ఇటీవలి కాలంలో స్టార్ హీరోల సినిమాలకు బయటకొస్తున్న ఫేక్ కలెక్షన్స్ వ్యవహారం సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. సాధారణంగా ఏదైనా కొత్త సినిమా రిలీజైతే దానికి సంబంధించిన లెక్కలన్నీ నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ల దగ్గరే ఉంటుంది. కానీ కొందరు అభిమానులు తమ హీరోని, తమ తోటి ఫ్యాన్స్‌ని ఖుషీ చేసేందుకు గాను భారీ వసూళ్లు సాధించినట్లుగా పోస్టర్లు వేస్తుంటారు. కోట్లలో నష్టాలు వచ్చినట్లు తెలిసినా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు నోరెత్తలేని పరిస్ధితి. నిజం చెబితే తర్వాత సినిమాను డిస్ట్రిబ్యూషన్‌‌కు ఇవ్వరేమోనని వారి భయం.

విడుదలకు ముందే మార్కెట్‌లో భారీ హైప్ తెచ్చుకున్న సినిమాలు రికార్డ్ ఓపెనింగ్స్ కొడితే ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాలు కూడా పట్టించుకోవు. కానీ హైప్ లేని సినిమాలకీ, మిక్స్‌డ్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా ఊహించని నెంబర్స్‌తో పోస్టర్లు వేస్తుండటం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది. ఈ సంక్రాంతికి వచ్చిన రామ్ చరణ్ - శంకర్‌ల గేమ్ ఛేంజర్ సినిమాకు ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ. 180 కోట్లకు పైగా ఓపెనింగ్స్ వచ్చినట్లుగా పోస్టర్‌లు వేయడం కలకలం రేపింది.

film critic kamal r khan made sensational comments on fake collections in bollywood

మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్స్ ఎలా సాధ్యం? ఇవి ఫేక్ కలెక్షన్స్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఇదే కాదు.. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఫేక్ కలెక్షన్ల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. మొన్నామధ్య సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిస్ట్రిబూటర్ల మీట్ సందర్భంగా పలువురు ఈ ఫేక్ కలెక్షన్స్‌పై బహిరంగంగానే పెదవి విరిచారు.

అయితే ఈ సంస్కృతి ఒక్క టాలీవుడ్‌లోకే పరిమితం కాలేదు.. దేశంలోని అన్ని పరిశ్రమల్లోనూ ఉందని విశ్లేషకులు అంటున్నారు. హీరోలను సంతృప్తి పరచడానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లినా మౌనంగానే ఉండాలని పలువురు వాపోతున్నారు. పరిస్ధితి ఇలాగే కొనసాగితే డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు ఎవరూ ముందుకు రారని అంటున్నారు . తాజాగా గతేడాది బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన శ్రద్దా కపూర్ నటించిన స్త్రీ 2 వసూళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్.

film critic kamal r khan made sensational comments on fake collections in bollywood

అమర్ కౌశిక్ దర్శకత్వంలో రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని రూ.120 కోట్ల బడ్జెట్‌తో జియో స్టూడియోస్, మద్దోక్ ఫిల్మ్స్ పతాకంపై దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా గతేడాది ఆగస్ట్ 15న విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ. 900 కోట్ల వసూళ్లతో దుమ్మురేపింది. అయితే ఈ కలెక్షన్స్ ఫేకే అంటున్నారు కమల్ .. తనకు తెలిసిన ఓ నిర్మాత ఉన్నాడని, అతను నటీనటులకు 5 రెట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇచ్చి నేడు దివాళా తీశాడని ఆయన పేర్కొన్నాడు.

film critic kamal r khan made sensational comments on fake collections in bollywood

జ్యోతి దేశ్‌పాండే, దినేజ్ విజన్‌లు తాము నిర్మించే సినిమాల అసలు కలెక్షన్స్ కంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా వసూళ్లు వచ్చినట్లు చెబుతారని బాలీవుడ్ మొత్తానికి తెలుసునని కమల్ వ్యాఖ్యానించాడు. స్రీ2 చిత్రం రూ.350 కోట్ల బిజినెస్ట్ చేస్తే .. రూ.600 కోట్లకు పైగా చేసినట్లు ప్రకటనలు ఇచ్చారు. అంటే అంబానీలను జ్యోతి దేశ్‌పాండే మోసం చేస్తున్నారా అని కమల్ ఆర్ ఖాన్ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: kamal r khan bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X