twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ ‘శ్రీమన్నారాయణ’ఫైనల్ రిజల్ట్

    By Srikanya
    |

    హైదరాబాద్ : బాలకృష్ణ హీరోగా, రవి చావలి దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మించిన 'శ్రీమన్నారాయణ' క్రిందటి శుక్రవారం విడుదల అయిన సంగతి తెలిసిందే. మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ఫైనల్ గా బాలకృష్ణ వరస ప్లాపుల్లో మరొకటిగా నమోదైంది. సోమవారం నుంచి చాలా చోట్ల కలెక్షన్స్ లేకపోవటంతో ట్రేడ్ లో ఈ నిర్ణయానికి వచ్చారు. డివైడ్ టాక్ తో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా మొదటి మూడు రోజులు బాగుంది. వీకెండ్ లో ఓకే అనిపించుకుంది. అయితే సోమవారం నుంచి గ్రాడ్యూవల్ గా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.

    ఈ చిత్రంలో బాలకృష్ణ తొలిసారిగా జర్నలిస్టు గా చేసారు. ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ బేనర్‌పై రమేశ్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మించారు. రవికుమార్ చావలి దర్శకుడు. మరో ప్రక్క ఈ చిత్రానికి పోటీగా విడుదలైన రెండు డబ్బింగ్ చిత్రాలు ఓకే ఓకే,మాస్క్ పెద్దగా ఓపినింగ్స్ తెచ్చుకోలేకపోయాయి. మాస్క్ చిత్రం ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోగా,ఓకే ఓకే చిత్రం ఓకే అనిపించుకుంది. కాబట్టి ఈ రెండు చిత్రాల వైపు నుంచి శ్రీమన్నారాయణకు పోటీ లేనట్లే. అయినా ఫలితం లేకపోయింది.

    అప్పటికీ ఈ చిత్రం ప్రమోషన్ లో బాలకృష్ణ సైతం ఎన్నడూ లేని విధంగా చాలా బిజీగా మీడియా ఛానెల్స్ లో కనపడుతున్నారు. హీరోయిన్స్ ఇషా ఛావ్లా కూడా ఈ చిత్రం ప్రమేషన్ నిమిత్తం మీడియాకు ఇంటర్వూలు ఇస్తోంది. అయినా కలెక్షన్స్ పికప్ కావటం లేదు. బాలకృష్ణ ఫ్యాన్స్ ను కూడా ఈ సినిమా తృప్తి పరచకపోవటమే ఈ రేంజి ప్లాపుకి కారణం అంటున్నారు. అధినాయకుడు తరహా కలెక్షన్స్ కూడా కష్టమే అని తేలుస్తున్నారు.

    బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇసా చావ్లా, విజయ్ కుమార్, సురేష్, వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, సినిమాటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నాగేందర్, కో డైరెక్టర్: ఎస్ సురేష్ కుమార్, పబ్లిసిటీ డిజైనర్ : రమేష్ వర్మ, కాస్ట్యూమ్స్: ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: వి.చంద్రమోహన్, మేనేజర్స్: కమల్ మోహన్ రావు, రామ్మోమన్, నిర్మాత: పుప్పాల రమేష్, కథ-కథనం-దర్శకత్వం: రవికుమార్ చావలి.

    English summary
    Nandamuri Balakrishna’s ‘Srimannarayana’ Srimannarayana couldn’t even satisfy Balayya fans fully. Chakri’s music and Balakrishna’s performance are the major assets. Srimannarayana is another disappointment from Balayya to the fans.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X