'మొగుడు' ఫైనల్ రిజల్టు (ట్రేడ్ టాక్)
కృష్ణవంశీ, గోపీచంద్ కాంబినేషన్ లో రూపొందిన మొగుడు చిత్రం ఫైనల్ గా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం డీసెంట్ ఓపినింగ్స్ తెచ్చుకున్నప్పటికి అప్పుడే కలెక్షన్స్ డ్రాప్ అవటం ప్రారంభమయ్యాయి. నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ వీకెండ్స్ లో ఈ చిత్రం బాగానే పే చేసింది. ఇక సెవెంత్ సెన్స్ విషయానికి వస్తే ఆ చిత్రం రెండవ వారంలోకి ప్రవేసించింది. కానీ చాలా చోట్ల ధియోటర్స్ నుంచి తీసేసారు. దాదాపు ఈ చిత్రం బిజెనెస్ క్లోజ్ అయినట్లే అని చెప్తున్నారు. అలాగే ఇదే వారం మొగుడు పాటు విడుదలైన ఉషాకిరణ్ వారి నువ్విలా చిత్రం అన్ని సెంటర్స్ లోనూ మంచి ఓపినింగ్స్ తెచ్చుకోగలిగింది. అయితే మయూరి డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రం పంపిణీని సరిగ్గా చేయలేకపోతున్నారని, దాంతో కలెక్షన్స్ పొటిన్షయల్ దెబ్బతీస్తోందని చెప్తున్నారు.
దాంతో హైదరాబాద్ లోనే చాలా చోట్ల తీస్తేస్తారని అంచనా వేస్తున్నారు. కాలేజీ యూత్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రం వారిని బాగానే ఆకట్టుకుంటోదని చెప్తున్నారు. ఇక బ్లాక్ బస్టర్ గా నిలిచిన దూకుడు మెయిన్ సెంటర్లలో తప్ప మిగతా చోట్ల కలెక్షన్స్ చాలా వరకూ డ్రాప్ అయిపోయినట్లు సమాచారం. చూడవల్సిన వారంతా ఎక్కువ ధియోటర్లలో విడుదల చేయటం వల్ల మొదటి రెండు వారాల్లోనే చూసేయటం వల్ల ఇప్పుడీ ఎఫెక్టు కనపడుతోందని విశ్లేషిస్తున్నారు. ఇక ఊసరవెల్లి చిత్రం ఇప్పటికే ప్లాప్ గా డిక్లేర్ అయ్యింది. కానీ బి, సి సెంటర్లలో యావరేజ్ గా కలెక్షన్స్ రాబడుతోంది.


Click it and Unblock the Notifications











