రామ్ గోపాల్ వర్మ "రక్త చరిత్ర-2" ఫైనల్ రిజల్ట్ ఏంటి?
రామ్ గోపాల్ వర్మ, తమిళ హీరో సూర్య కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్టుగా రూపొందిన "రక్త చరిత్ర-2" చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా కన్ఫర్మ్ అయిందని ట్రేడ్ లో కలెక్షన్స్ ని బట్టి చెప్తున్నారు. మల్టీప్లెక్స్ లు మినహా చాలా చోట్ల కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయని, వీకెండ్స్ లో సినిమా చూద్దామని బుక్ చేసుకున్నవారు తప్ప కొత్తగా చూద్దామనకునేవారిలో ఆసక్తి పోయిందని చెప్తున్నారు. అలాగే తమిళంలోనూ రక్తచరితమ్ ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. అక్కడ మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం పెద్ద తలనొప్పిగా మారిందని బహిరంగ విమర్శలే వినిపిస్తున్నారు. తమ యాక్షన్ హీరోని రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ హీరోని చేసే ప్రయత్నం చేసాడని అందుకే చూడలేకపోతున్నామన్నామని అక్కడ జనం స్పందనగా తమిళ మీడియా పేర్కొంటోంది.ఇక హిందిలోనూ మొదటి పార్ట్ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక రెండో పార్టు అస్సలు చూడలేమంటూ చేతులు ఎత్తేసారు. దాంతో అన్ని చోట్లా ఇనానమస్ గా ఇది ప్లాప్ గా నమోదు అయింది. విపరీతమైన స్లో నేరేషన్, సెకెండాఫ్ లో అస్సలు కొంచెం కూడా కథ లేకుండా నడిపే ప్రయత్నం సినిమాని నీరస పరిచాయి.


Click it and Unblock the Notifications











