'స్వామి రారా' ఫైనల్ టాకేంటి?!

By Srikanya

హైదరాబాద్ : నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా నటించిన 'స్వామి రారా' చిత్రం మొన్న శనివారం విడుదల అయిన సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ అనగనగా ఒక రోజు, క్షణ క్షణం చిత్రాలకు గుర్తు చేస్తూ సాగే ఈ చిత్రం మార్నింగ్ షోకే హిట్ టాక్ తెచ్చుకుంది. నిఖిల్ గత ఫ్లాప్ చిత్రాల ఎఫెక్టుతో ఓపినింగ్స్ లో ఊపు లేకపోయినా తర్వాత టాక్ స్ప్రెడ్ కావటంతో పుంజుకున్నాయి. US లో కూడా ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వీకెండ్ లో లిమెడెట్ స్క్రీన్స్ లో $45,000 కలెక్టు చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి హీరో నారా రోహిత్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. రొమాంటిక్,యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందిందారు. చిత్రంలో వినాయకుడి విగ్రహానికీ, ఓ దొంగ ప్రేమ కథకూ సంబంధం ఏమిటనేది ఆసక్తికరం. కథ ప్రకారం సూర్య (నిఖిల్‌) ఓ జేబుదొంగ. బతుకుదెరువు కోసం దొంగతనాలు చేస్తుంటాడు. అతనికి స్వాతి (స్వాతి) అనే ఓ పాత్రికేయురాలితో పరిచయం అవుతుంది. మరోవైపు అనంతపద్మనాభస్వామి గుడిలో కనీవినీ ఎరుగని సంపద దొరుకుతుంది. అయితే అందులోంచి ఓ వినాయక విగ్రహం మాయం అవుతుంది. ఆ విగ్రహం కోసం కొంతమంది అన్వేషణ మొదలుపెడతారు. సూర్య, స్వాతిలు కూడా విఘ్నేశ్వరుడి కోసం వేట ప్రారంభిస్తారు. ఇంతకీ ఆ విగ్రహం ఏమైంది? ఎవరికి దొరికింది? అనేదే చిత్ర కథ.

దర్శకుడు మాట్లాడుతూ ''వినోదాత్మకంగా సాగే చిత్రమిది. నేర పరిశోధన నేపథ్యంగా సాగుతుంది. నిఖిల్‌, స్వాతిల జంట చూడముచ్చటగా ఉంటుంది. తెరపై కనిపించే ప్రతి పాత్రకూ ఓ ప్రాధాన్యం ఉంటుంది. రవిబాబు విలన్ గా కనిపిస్తారు. అసలే దొంగ. ఆపై ప్రేమలో పడ్డాడు. ప్రేయసి కూడా.. 'దొరికిందంతా దోచేయ్‌.' అని ప్రోత్సహించే రకం. ఆ ఉత్సాహంలో మరింత రెచ్చిపోయాడు. కంటికి కనిపించిందల్లా జేబులోకి తోసేశాడు. వీరిద్దరూ కలసి చేసిన హంగామా ఎలాంటిదో తెలియాలంటే మా సినిమా చూడండి అన్నారు. సరదాగా సాగే ప్రేమకథ ఇది ''అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X