టార్గెట్ 2000 కోట్లు.. మహేశ్, ప్రభాస్, అల్లు అర్జున్.. రికార్డ్ ను బ్రేక్ చేయబోయేది ఎవరో తెలుసా?
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ గా టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలపై అంతకంతకు అంచనాలు పెరుగుతున్నాయి . బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ చిత్రాల తర్వాత తెలుగు సినిమాలకు భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే టాలీవుడ్ దర్శక, నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ చిత్రాలవైపు మొగ్గు చూప్తున్నారు. ఇక ఇండియాలోని ప్రధాన ప్రాంతీయ భాషల్లోనూ గట్టిగానే పోటీ నడుస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి నెక్ట్స్ 2000 సినిమా ఏంటనేది ప్రధానంగా చర్చ జరుగుతోంది. సినీ ప్రముఖులు కూడా ఈ చిత్రాలతో టార్గెట్ రీచ్ అవ్వడం సులువని అంచనా వేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
మహేశ్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ భారీ ప్రాజెక్ట్స్..
ప్రస్తుతం టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రాల్లో అతి భారీ బడ్జెట్ ఫిల్మ్ SSMB 29. రూ.1000 కోట్లతో నిర్మిస్తుండటం విశేషం. సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ లోనూ హాలీవుడ్ స్థాయికి తగ్గకుండా సై-ఫై ఫిల్మ్ రూపుదిద్దుకుంటుండటం విశేషం. సన్ పిక్చర్స్ సంస్థ రూ.800 కోట్లతో నిర్మిస్తోంది. హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు.

మరోవైపు బాహుబలి, కల్కి 2898 ఏడీ చిత్రాలతో పాన్ వరల్డ్ హీరోగా మారిన ప్రభాస్ నుంచి నెక్ట్స్ కల్కి 2898 ఏడీ సీక్వెల్ రూపుదిద్దుకోవాల్సి ఉంది. ఆ చిత్రం కూడా రూ.500 కోట్లకు పైగానే బడ్జెట్ ను కలిగి ఉంటుందని అంచనా. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్ లోని 'పెద్ది' చిత్రం రూ.300 కోట్లతో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాపైనా కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
9 ఏళ్లుగా రికార్డు ఆయన పేరు మీదనే..
ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ హ్యయేస్ట్ గ్రాస్ వసూల్ చేసిన ఇండియన్ ఫిల్మ్ దంగల్. 2200 కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేసింది. అయితే ఈ టార్గెట్ ను బ్రేక్ చేసేందుకు కొన్నాళ్లుగా ఇండియాలోని మెయిన్ రీజీనల్ ఫిల్మ్ స్టార్స్, డైరెక్టర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే. చివరిగా ప్రభాస్ బాహుబలి 2, అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రాలు ఆ టార్గెట్ దగ్గరి వరకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో నెక్ట్స్ టాలీవుడ్ నుంచి ఏ చిత్రం 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ గా హ్యయేస్ట్ గ్రాస్ వసూల్ చేసిన ఇండియన్ ఫిల్మ్ రికార్డు మాత్రం 9 ఏళ్లుగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ దంగల్ పైనే ఉంది. దాన్ని ఎవరు బ్రేక్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
2000 టార్గెట్ దిశ టాలీవుడ్ స్టార్స్..
ఇక టాలీవుడ్ స్టార్స్ రాబోయే చిత్రాలతో ఎలాగైనా 2000 కోట్లకు పైగానే గ్రాస్ వసూళ్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తారు. చివరిగా పుష్ప2 తో అల్లు అర్జున్ ఆ దిశగా ప్రయాణించారు. కేవలం రూ.1800 కోట్ల గ్రాస్ వసూళ్లకే పరిమితం అయ్యారు. ఇక నెక్ట్స్ అల్లు - అట్లీ ప్రాజెక్ట్ తోనైనా ఈ టార్గెట్ ను బ్రేక్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ప్రభాస్ కల్కి 2898 ఏడీ సీక్వెల్ మహాభారతం అంశాలతో రూపుదిద్దుకోనుండటంతో ఆ చిత్రంపైనా వరల్డ్ వైడ్ గా మార్కెట్ చేస్తుందనే అంచాలు ఉన్నాయి. ఇక మాస్టర్ మైండ్ జక్కన్న మహేశ్ బాబుతో 2000 గ్రాస్ వసూళ్లు అవలీలగా సాధిస్తారని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మహేశ్ బాబు - ఎస్ఎస్ రాజమౌళి ప్రాజెక్ట్ SSMB 29 మాత్రం పక్కాగా 2000 కోట్ల గ్రాస్ ను పక్కాగా దాటుందని అభిప్రాయలు వెల్లడవుతున్నాయి.


Click it and Unblock the Notifications











