హ్యాట్రిక్‌పై కన్నేసిన బాలయ్య.. తొలి రోజు 30 కోట్లతో సంచలనం!

నందమూరి బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్రని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా థియేటర్స్ కు వెళుతున్నారు. సంక్రాంతి సీజన్ నేపథ్యంలో బాలయ్యకు మంచి ట్రాక్ రికార్డ్ ఉండడం, పైగా ఎన్టీఆర్ బయోపిక్ కావడంతో తారా స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ట్రేడ్ విశ్లేషకులు కూడా తొలి రోజు ఈ చిత్రం కళ్ళు చెదిరే వసూళ్ళని నమోదు చేసుకోబోతోంది అంచనా వేస్తున్నారు.

ఇది బాలయ్య సీజన్

ఇది బాలయ్య సీజన్

సంక్రాంతి అంటే బాలయ్య సినిమాలకు పెట్టింది. బాలకృష్ణ సంక్రాంతి బరిలో నిలిచిన ప్రతిసారి విజయం వరించింది. బలకృష్ణ నటించిన నరసింహ నాయుడు, సమరసింహారెడ్డి, లక్ష్మి నరసింహ లాంటి చిత్రాలు సంక్రాంతికి విడుదలై తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

హ్యాట్రిక్‌పై కన్ను

హ్యాట్రిక్‌పై కన్ను

2017లో బాలకృష్ణ నటించిన చారిత్రాత్మక చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2018 సంక్రాంతికి విడుదలైన జైసింహా చిత్రం కమర్షియల్ సక్సెస్ సాధించింది. ప్రస్తుతం బాలయ్య ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంతో హ్యాట్రిక్ పై కన్నేశాడు. తాజాగా ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే బాలయ్యకు హ్యాట్రిక్ విజయం ఖాయమైనట్లే అనిపిస్తోంది.

1100 స్క్రీన్స్‌లో విడుదల

1100 స్క్రీన్స్‌లో విడుదల

ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1100 స్క్రీన్స్‌లో విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే 600 స్క్రీన్స్ లో విడుదలవుతుండడం విశేషం. బాలయ్య కెరీర్ లో ఇంత భారీస్థాయిలో చిత్రం విడుదుల కానుండడం ఇదే తొలిసారి. గతంలో గౌతమి పుత్ర శాతకర్ణి అత్యధిక థియేటర్స్ లో విడుదలయింది. సంక్రాంతి బరిలో ముందుగా విడుదలవుతున్న చిత్రం ఇదే.

ట్రేడ్ విశ్లేషకుల అంచనా

ట్రేడ్ విశ్లేషకుల అంచనా

విపరీతమైన క్రేజ్ తో విడుదలవుతున్న ఎన్టీఆర్ కథానాయకుడుపై ట్రేడ్ విశ్లేషకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రం తొలి రోజు 30 కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగా ఉండడంతో ఎన్టీఆర్ కథానాయకుడు తొలి రోజు వసూళ్లపై ఆసక్తి నెలకొని ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X