ఫస్ట్ లుక్ టాక్ : యూత్ కి పట్టేసింది (ఫొటో)
హైదరాబాద్ : ఫస్ట్ లుక్, ట్రైలర్ ... ఈ రెండింటి విషయంలో సినిమావాళ్లు ప్రారంభం రోజు నుంచీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే అది చూసే.. ట్రేడ్ లో క్రేజ్ వచ్చి బిజినెస్ మొదలవుతుంది. ఓపినింగ్స్ కు ఇదే రహదారి వేస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే... నాగ చైతన్య, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా 'ఒక లైలా కోసం'ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ ..కలర్ ఫుల్ గా స్టైలిష్ గా ఉంది అంటున్నారు. యూత్ ని ఖచ్చితంగా ఎట్రాక్ట్ చేసే లుక్ ఇది అంటున్నారు.
ఇటీవలే ఆటోనగర్ సూర్య చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగచైతన్యకు ఈ చిత్రం నిరాశేమిగిల్చింది. ఈ సినిమా తరువాత మళ్లీ హిట్ కొట్టాలనే కసితో అన్ని జాగ్రత్తలు తీసుకుని చేసినట్లుంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌కుమార్ కొండా దర్శకుడు.
ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.

దర్శకుడు మాట్లాడుతూ... సున్నితమైన భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కుతోన్న రొమాంటిక్ ప్రేమకథాచిత్రమిది. ప్రేయసి కోసం ఓ ప్రియుడు ఏం చేశాడన్నదే ఇందులో ఆసక్తికరం. నాగచైతన్య పాత్ర చిత్రణ కొత్త పంథాలో సాగుతుంది. ఆయన నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వినోదంతో పాటు కథలోని మలుపులు ఆకట్టుకుంటాయి. త్వరలోనే ప్రచార చిత్రాలతో పాటు ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.
బ్రహ్మానందం, అలీ, ప్రభు గణేషన్, నాజర్ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: ఐ. ఆండ్రూ, కూర్పు: ప్రవీణ్ పూడి. ఈ చిత్రానికి నిర్మాతః నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: విజయకుమార్ కొండా.


Click it and Unblock the Notifications











