2.0 ఫస్ట్ వీక్ సెన్సేషన్... రూ. 500 కోట్లతో వసూళ్ల ప్రభంజనం!
Recommended Video

2.0 మూవీ వసూళ్ల ప్రభంజనం చూస్తుంటే 2018 సంవత్సరం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ హయ్యెస్ట్ కలెక్షన్ రికార్డుతో ముగిసేలా కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' దారుణమైన ప్లాప్ అవ్వగా... ఆవెంటనే రిలీజైన 2.0 చిత్రం బాక్సాఫీస్ గ్రాఫ్‌ను ఒక్కసారిగా పైకి లేపింది.
బుధవారంతో ఫస్ట్ వీక్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్లు వసూలు చేసి సరికొత్త మైల్ స్టోన్ అందుకుంది. ఇండియన్ మార్కెట్లో ఈ మార్కెట్లో దాదాపు రూ. 370 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ విజువల్ వండర్ ఇంటర్నేషనల్ మార్కెట్లో దాదాపు రూ. 130 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

కేరళలో రికార్డ్స్ బద్దలు
కేరళలో 2.0 ఆల్రెడీ సర్కార్ మూవీ లైఫ్ టైమ్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఇక్కడ ఈ చిత్రం రూ. దాదాపు 15 కోట్లు వసూలు చేయడం ద్వారా మలయాళం ఇండస్ట్రీలో ఇతర భాషా చిత్రాల పేరు మీద ఉన్న హయ్యెస్ట్ గ్రాస్ రికార్డులన్నీ బద్దలయ్యాయి.

చెన్నైలో అదగొడుతోంది
మరో వైపు చెన్నై సిటీలో రజనీకాంత్ నటించిన ఈచిత్రం అదరగొడుతోంది. తొలి 7 రోజుల్లో ఈ మూవీ 13.64 కోట్లు రాబట్టింది. రజనీ కెరీర్లో ఇక్కడ హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రం ఇదే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

యూఎస్ఏ మార్కెట్లో...
ఇంటర్నేషనల్ మార్కెట్లను పరిశీలిస్తే అక్కడ స్మూత్ రన్ సాగుతోంది. యూఎస్ఏ మార్కెట్లో ఇప్పటికే 4 మిలియన్ డాలర్ మార్కును క్రాస్ అయిన ఈ చిత్రం కబాలి తర్వాత హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. వచ్చే వీకెండ్ సమయానికి ఈ రికార్డును అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.

హిందీ మార్కెట్లో పరిస్థితి ఇదీ...
హిందీ మార్కెట్లో 2.0 మూవీ కలెక్షన్స్ పరిశీలిస్తే.... గురువారం రూ. 20.25 కోట్లు, శుక్రవారం రూ. 18 కోట్లు, శనివారం రూ. 25 కోట్లు, ఆదివారం రూ. 34 కోట్లు, సోమవారం రూ. 13.75 కోట్లు, మంగళవారం రూ. 11. 50 కోట్లు రాబట్టింది. 7వ రోజైన బుధవారం రూ. 10.50 కోట్లు వసూలూ చేసింది. దీంత హిందీ మార్కెట్ గ్రాస్ రూ. 132 కోట్లకు రీచ్ అయింది.
సౌత్ మార్కెట్లో ప్రభంజనం
సౌత్ మార్కెట్లో ఈ చిత్రానికి వసూళ్ల ప్రభంజనం కొసనాగుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో కలిసి తొలి 7 రోజుల్లో దాదాపు రూ. 240 కోట్ల గ్రాస్ వసూలైనట్లు తెలుస్తోంది. ఏరియా వైజ్ కలెక్షన్ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

మరో వారం పాటు బాక్సాఫీసున దున్నేస్తుంది
ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం మరో వారం రోజుల పాటు 2.0 చిత్రం ఇండియన బాక్సాఫీసు వద్ద దున్నేయడం ఖాయం అంటున్నారు. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో సెకండ్ వీకెండ్ కీలకంగా ఉంటుందని... ఆ తర్వాత సినిమా ఫుల్ రన్‌లో టోటల్ ఎంత వరకు బిజినెస్ చేస్తుందో అంచనా వేయవచ్చని అంటున్నారు.


Click it and Unblock the Notifications











