twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్ఎక్స్ 100 ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. తిరుగులేని విజయం!

    |

    Recommended Video

    RX 100 First Week Collections

    యంగ్ హీరో కార్తికేయ, బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన సెన్సేషనల్ మూవీ ఆర్ఎక్స్ 100 చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలననాలు కొనసాగిస్తోంది. తొలి వారంలో ఈ చిత్రం వసూళ్ల విషయంలో తిరుగులేని ప్రదర్శన కనబరిచింది. కేవలం 2 కోట్ల అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఆర్ఎక్స్ 100 చిత్రం చిన్న చిత్రంగా విడుదలై టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ చిత్ర తొలి వారం సాధించిన వసూళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

    బోల్డ్ పెర్ఫామెన్స్

    బోల్డ్ పెర్ఫామెన్స్

    ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరో, హీరోయిన్ ఇద్దరూ మంచి గుర్తింపు పొందారు. రొమాంటిక్, లవ్, ఎమోషన్ సన్నివేశాలలో వీరి నటనకు యువతని విపరీతంగా ఆకట్టుకుంది. చిత్ర దర్శకుడు అజయ్ భూపతి అయితే ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయాడు.

     తెలుగు రాష్ట్రాల్లో

    తెలుగు రాష్ట్రాల్లో

    తిరుగులేని వసూళ్లతో తొలి వారాన్ని ఈ చిత్రం విజయవంతంగా ముగించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఫస్ట్ వీక్ లో దదాపు 7.5 కోట్ల షేర్ రాబట్టడంవిశేషం. ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఈ వీకెండ్ ముగిసే సమయానికి ఏ చిత్రం 10 కోట్ల రాబట్టడం ఖాయం అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

    నైజాంలో అదిరేలా

    నైజాంలో అదిరేలా

    నైజాంలో ఆర్ఎక్స్ 100 చిత్రం వసూళ్లు అదుర్స్ అనిపించే విధంగా ఉన్నాయి. తొలి వారంలో ఈ చిత్రం నైజాంలో 3.65 కోట్లు రాబట్టడం విశేషం. ఉత్తరాంధ్రలో 86, సీడెడ్ లో 88 లక్షలు రాబట్టింది.

     క్యూ కడుతున్న ఆఫర్స్

    క్యూ కడుతున్న ఆఫర్స్

    ఈ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనంగా మారాడు. బడా నిర్మాణ సంస్థలు, క్రేజీ హీరోల నుంచి అజయ్ కు ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దర్శకుడు తదుపరి నితిన్ తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    English summary
    First week collections of RX100. Trade experts declare the movie as blockbuster
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X