twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంత రికార్డు: ఒకే నెలలో ఐదు రిలీజ్ లు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఏ హీరోయిన్ కీ రానీ అరుదైన అవకాసం స్టార్ హీరోయిన్ సమంతకు దక్కుతోంది. ఆమె నటించిన ఐదు సినిమాలు కేవలం నాలుగు వారాలు(ఒకే నెల)లో విడుదల అవుతున్నాయి. ఈ విషయమై సమంత చాలా సంతోషంగా ఉంది. డిసెంబర్ నెలలో ఈ మ్యాజిక్ జరగనుంది. ఆమెతో మొదలుపెట్టిన సినిమాలు అన్ని డిసెంబర్ లో రిలీజ్ కు పెట్టుకోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఈ సినిమాలు ఒకదానికొకటి పోటీ కాదంటున్నారు.

    ఈ విషయమై సమంత మాట్లాడుతూ..., " నాకు చాలా సర్పైజింగ్ గా ఉంది. ఇలా ఒకేసారి నా సినిమాలన్నీ లైన్ కట్టడం తలుచుకుంటేనే ఆనందం,ఉద్వేగం కలుగుతోంది. నేను ఈ సినిమాలు మొదలుపెట్టినప్పుడు ప్రతీనెలలో ఒకో సినిమా విడుదల అవుతాయనుకున్నాను. ఇలా వరసగా సినిమాలు రిలీజ్ అవుతూంటే ఎలా ప్రమోట్ చేయాలో,ఎలా ఈ చిత్రాలన్నిటి ప్రమోషన్ లో పాల్గొనాలో అర్దం కావటం లేదు. ఎందుకంటే అన్ని సినిమాలూ ముఖ్యమైనవే. ప్రాముఖ్యమైనవే..అన్నీ మంచి అంచనాలు ఉన్నవే..!" అందామె.

    అలాగే ఆ రిలీజ్ కానున్న ఆ చిత్రాలు గురించి సమంత మాట్లాడుతూ... "గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఎటో వెళ్లిపోయింది మనస్సు చిత్రం తమిళ,తెలుగు భాషల్లో విడుదల అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో విడుదల అయ్యింది. గతంలో మా కాంబినేషన్ లో వచ్చిన ఏమి మాయ చేసావే చిత్రం ఘన విజయం సాధించటంతో ఈ చిత్రంపై అంచనాలు బాగా ఉన్నాయి. అలాగే నందినీరెడ్డి దర్శత్వంలో సిద్దార్ద హీరోగా చేస్తున్న చిత్రం కూడా అదే నెలలో విడుదల అవుతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ ఆ చిత్రం. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది " అన్నారు.

    ఇక వీటితో పాటు" దేవకట్టా దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా చేస్తున్న ఆటో నగర్ సూర్య కూడా ఇదే నెలలో విడుదల అవుతోంది. నాగచైతన్యతో గతంలో నేను చేసిన ఏమి మాయ చేసావే ఘన విజయం సాధించింది. మళ్లీ మా కాంబినేషన్ అంటే ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది. ఇక మహేష్ బాబుతో చేస్తున్న ఏమి మాయ చేసావే చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఆ సినిమా ఇప్పటికే ఓ రేంజిలో క్రేజ్ తెచ్చుకుంది" అంటూ చెప్పుకొచ్చింది.

    English summary
    
 Samantha is happy that she is going to be having a busy December this year. The actress will be promoting five of her films that will be releasing that month. She says, "I'm quite surprised how the releases have been lined up. I haven't even started comprehending that I will have a release every week that month. I don't know how I am going to be promoting them!"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X