వరదల్లో మునిగాయి(ట్రేడ్ టాక్)
క్రిందటివారం రిలీజైన నిన్ను కలిసాక, హాలీడేస్ చిత్రాలు రెండూ భాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. ఉషాకిరణ్ మూవీస్ వారు నచ్చావులే చిత్రంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చి తీసిన చిత్రం కావటంతో నిను కలిసాక చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే కథ, కథనం బోర్ కొట్టేలా ఉండటం మైనస్ గా మారింది. టీనేజ్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రం ఏ వర్గానికి నచ్చలేదు. ఇక హాలీడేస్ గురించి హాలీడే రోజున్నా మాట్లాడే వారు కరువయ్యారు. ఆ రెండూ అలా ఉంటే గతవారం రిలీజైన గణేష్, రెచ్చిపో చిత్రాలు పూర్తి స్ధాయి ఫ్లాఫ్ ని మూటకట్టుకున్నాయి. రాజేంద్రప్రసాద్ క్విక్ గన్ మురగన్ రిలీజయ్యిందనే సంగతి చాలా మందికి తెలియదు. వీటిన్నటి మధ్యలో మగధీర మాత్రమే ఉన్నంతలో కలెక్షన్స్ సంపాదించుకుంటోంది. అందులోనూ ఈ వీక్ మొత్తం వరదలు హడావిడిలో జనం మునిగిపోవటం సినిమాలకు పెద్ద డ్రాబాక్.
నిన్ను కలిసాక హాలీడేస్ మగధీర గణేష్ రెచ్చిపో క్విక్ గన్ మురగన్ వరదలు శివనాగేశ్వరరావు రామోజీరావు ninnu kalisaaka siva nageswararao ramoji rao holidays ganesh rechipo floods


Click it and Unblock the Notifications