twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2018-19లో సంపాదనలో వరల్డ్ టాప్ హీరోలు వీరే... ఇండియా నుంచి ఎవరంటే?

    |

    ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ వరల్డ్ హయ్యెస్ట్ పేయిడ్ యాక్టర్ల టాప్ 10 లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్టులో ఇండియా నుంచి చోటు దక్కించుకున్న ఒకే ఒక్క నటుడు అక్షయ్ కుమార్. దాదాపు 65 మిలియన్ అమెరికన్ డాలర్ల(రూ. 466 కోట్లు) సంపాదనతో అక్షయ్ కుమార్ ఈ లిస్టులో తన స్థానం పదిలం చేసుకున్నాడు.

    2018-19 సంవత్సరానికి గాను అత్యధికంగా సంపాదించిన యాక్టర్లలో హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ అలియాస్ ది రాక్ 89.4 మిలియన్ డాలర్లు(రూ. 640 కోట్ల)తో మొదటి స్థానం దక్కించుకున్నాడు. అక్షయ్ కుమార్ రూ.466 కోట్ల సంపాదనతో 4వ స్థానంలో నిలిచాడు.

    Forbes worlds 10 highest-paid actors list in 2019: Akshay Kumar in 4th spot

    ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం... ఆస్ట్రేలియన్ యాక్టర్, మార్వెల్ సినిమాల్లో థోర్ పాత్రలో కనిపించే క్రిస్ హేమ్స్‌వర్త్ 76.4 మిలియన డాలర్లు(రూ. 547 కోట్లు) సంపాదనతో 2వ స్థానం దక్కించుకున్నాడు. జూన్ 2018 నుంచి జూన్ 2019 మధ్య కాలంలో ఆయా యాక్టర్లు సంపాదించిన మనీ ఆధారంగా ఫోర్బ్స్ సంస్థ ఈ జాబితా తయారు చేసింది.

    ఈ ప్రపంచానికి ఐరన్ మ్యాన్ పాత్రలో సుపరిచితమైన రాబర్ట్ డౌనీ జూనియర్ 66 మిలియన్ డాలర్లు(రూ. 473 కోట్ల) సంపాదనతో 3వ స్థానంలో నిలిచాడు. ఇక యాక్షన్ హీరో జాకీచాన్ 58 మిలియన్ డాలర్లు(రూ. 415 కోట్లు) సంపాదనతో 5వ స్థానంలో ఉన్నారు. 6వ స్థానాన్ని బ్రాడ్లీ కూపర్, ఆడమ్ శాండ్లర్ సంయుక్తంగా పంచుకున్నారు. ఈ ఇద్దరూ 57 మిలియన్ డాలర్లు(రూ. 408 కోట్లు) సంపాదించారు.

    హాలీవుడ్ నటుడు క్రిస్ ఇవాన్స్ 43.5 మిలియన్ డాలర్లు (రూ. 311 కోట్లు) సంపాదనతో 8వ స్థానంలో ఉన్నాడు. 9వ, 10వ స్థానాల్లో పాల్ పాల్ రూడ్ 41 మిలియన్ డాలర్లు(రూ. 293 కోట్లు), విల్ స్మిత్ 35 మిలియన్ డాలర్లు(రూ. 250 కోట్లు) సంపాదించారు.

    డ్వేన్ జాన్సన్ - USD 89.4 మిలియన్లు (సుమారు రూ .640 కోట్లు)

    క్రిస్ హేమ్స్‌వర్త్ - USD 76.4 మిలియన్లు (సుమారు రూ. 547 కోట్లు)

    రాబర్ట్ డౌనీ జూనియర్ - 66 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 473 కోట్లు)

    అక్షయ్ కుమార్ - 65 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 466 కోట్లు)

    జాకీ చాన్ - USD 58 మిలియన్ (సుమారు రూ .415 కోట్లు)

    బ్రాడ్లీ కూపర్ - USD 57 మిలియన్ (సుమారు రూ .408 కోట్లు)

    ఆడమ్ శాండ్లర్ - USD 57 మిలియన్ (సుమారు రూ .408 కోట్లు)

    క్రిస్ ఎవాన్స్ - USD 43.5 మిలియన్ (సుమారు రూ. 311 కోట్లు)

    పాల్ రూడ్ - USD 41 మిలియన్ (సుమారు రూ .293 కోట్లు)

    విల్ స్మిత్ - 35 మిలియన్ డాలర్లు (సుమారు 250 కోట్లు)

    English summary
    Forbes has released the list of the world's 10 highest-paid actors in 2019. The list was topped by Hollywood actor Dwayne Johnson with USD 89.4 million earning. Bollywood actor Akshay Kumar has securing the fourth place with an earning of USD 65 million.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X