నాలుగు రిలీజులు..నాలుగు ప్లాపులు(ట్రేడ్ టాక్)

By Srikanya

గడిచిన వారం ప్రేక్షకుల తీర్పును కోరుతూ నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. అవి రామ్‌గోపాల్‌వర్మ 'దొంగల ముఠా", సుమంత్ "రాజ్", ఉపేంద్ర 'రజని", మరో చిత్రం 'కారాలు-మిరియాలు". ఈ చిత్రాల్లో ముఖ్యంగా చెప్పుకోవలసింది ఎక్కువ హైప్ క్రియేట్ చేసిన చిత్రం వర్మ 'దొంగల ముఠా". కేవలం ఐదు రోజుల్లో చిత్రం షూటింగ్ పూర్తి చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన వర్మ ఈ చిత్రం ద్వారా ఘోర పరాజయాన్నే తన ఖాతాలో వేసుకున్నారు. చిత్రం కథలో విషయం లేకపోవటమే కాక టెక్నికల్ గానూ పూర్ గా ఉంది. వర్మ అభిమానులు సైతం ఈ చిత్రాన్ని చూసి తిట్టుకుంటూ వస్తున్నారు.

ఇక ఈ చిత్రం తర్వాత చెప్పుకోవాలింది రాజ్. సుమంత్, ప్రియమణి, విమలారామన్ కాంబినేషన్ లో మనసంతా నువ్వే దర్సకుడు వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన 'రాజ్"లో ఎక్సపోజింగ్ పై పెట్టిన దృష్టి కథా,కథనాలపై పెట్టక చతికిలపడింది. ఇక నవకేశ్, మధుశాలిని జంటగా వచ్చిన 'కారాలు-మిరియాలు" ఫరలేదంటున్నారు కానీ ధియోటర్ లో ప్రేక్షకులు మాత్రం కనపడటం లేదు. అలాగే ఉపేంద్ర హీరోగా నటించిన 'రజని" చిత్రంభాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇలా ఈ వారం విడుదలైన చిత్రాలేవీ అంతగా ప్రేక్షకుల మెప్పును పొందలేకపోయాయి. ఈ చిత్రాలకు కలెక్షన్లు సైతం నిరాశజనకంగానే ఉండడంతో బాక్సాఫీస్ ఉసూరుమంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X