వీటిల్లో ఏది హిట్టయ్యే సినిమా?
హైదరాబాద్ : శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రేమికులకు ఆనందం. ఈ శుక్ర వారం(4,జూలై 2014) నాలుగు తెలుగు సినిమాలు థియోటర్స్ ని పలకరించనున్నాయి. అన్నీ ఓ మాదిరి బడ్జెట్ చిత్రాలే కావటం విశేషం. అందులో ముఖ్యంగా సందీప్ కిషన్ ...రారా కృష్ణయ్య చిత్రంపైనే అందరి అంచనాలు ఉన్నాయి.
వీటిలో మూడు స్ట్రైట్ చిత్రాలు కాగా ఒక డబ్బింగ్ చిత్రం ఉంది. ఇప్పటికే బుల్లి తెరపైనా, వెబ్ మీడియాలోనూ వీటి ప్రమోషన్స్ జోరు అందుకున్నాయి. పెద్ద సినిమాలు ఏమీ దరిదాపుల్లో కూడా లేకపోవటంతో వీటిల్లో ఏది హిట్టైనా అది భాక్సాఫీస్ వద్ద నిలబడే అవకాసం ఉంది.
ముఖ్యంగా థియోటర్స్ వారు ఫీడింగ్ ఇచ్చే చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఓపినింగ్స్ కూడా రాబట్టని చిత్రాలపై వారు ఆసక్తి చూపటం లేదు. అయితే క్రితం వారం రిలైజన ఆటో నగర్ సూర్య, అంతకు ముందు వారం విడుదలైన ఊహలు గుసగుసలాడే చిత్రాలు పెద్దగా ఇంపాక్ట్ చూపకపోవటంతో వీటి పైనే అందరి దృష్టీ ఉంది.
ఈ వారం సినిమాలు స్లైడ్ షో లో ...

రారా కృష్ణయ్య
సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం 'రారా కృష్ణయ్య'. కృష్ణవంశీ శిష్యుడు మహేశ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం జూలై 4 న విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మాత. జగపతిబాబు ఈ చిత్రంలో హీరో అన్నగా ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ట్రైలర్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఓపినింగ్స్ బాగుంటాయని భావిస్తున్నారు.

కుల్ఫీ
జై, స్వాతి జంటగా శరవణరాజన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన వడకర్రి చిత్రాన్ని కుల్ఫీ పేరుతో తెలుగుప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత నరసింహరెడ్డి సామల. తమిళ దర్శకుడు వెంకట్‌ప్రభు, కస్తూరి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ శంగార నాయిక సన్నిలియోన్ ఓ ప్రత్యేకగీతంలో నర్తించింది.

ఆ ఐదుగురు
ఇదివరకు 'ఆ నలుగురు', 'వినాయకుడు' వంటి చిత్రాలను నిర్మించిన ప్రేమ్ మూవీస్ ప్రై. లిమిటెడ్ పతాకంపై సరిత పట్రా నిర్మిస్తున్న చిత్రం 'ఆ ఐదుగురు'. ప్రేమ్‌కుమార్ పట్రా సమర్పిస్తున్న ఈ చిత్రానికి 'అతడే సీఎం' అనేది ఉప శీర్షిక. అనిల్ జేసన్ గూడూరు దర్శకత్వం వహిస్తున్నారు. క్రాంతి, తనిష్క్, క్రాంతికుమార్, కృష్ణతేజ, శశికాంత్ రచ్చ టైటిల్ పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో అస్మిత సూద్, వెంకట్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రేమలో ఎబిసి
ఎజి అండ్ ఎజి ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ప్రముఖ సంఘసేవకులు జె.వి.రెడ్డి నిర్మిస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్. తలారి నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అజయ్,రిషి, రూబిపరిహార్, శ్రీ బరా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











