Funky Advance Booking: ఫంకీ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్.. అమెరికాలో విశ్వక్‌సేన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్నారు మాస్ కా దాస్ విశ్వక్‌సేన్. అప్పుడెప్పుడో దాస్ కా ధమ్కీ తర్వాత ఆయన హిట్ కొట్టింది లేదు. భూ, గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ, లైలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో విశ్వక్‌సేన్ కొంత గ్యాప్ తీసుకున్నారు. అనంతరం యూత్‌కి నచ్చే కథాంశంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు విశ్వక్‌సేన్. అదే ఫంకీ.

ఫిబ్రవరి 13 ఫంకీ
జాతిరత్నాలు ఫేం అనుదీప్ కేవీ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో పాటు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13వ తేదీన ఫంకీ వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. అమెరికాలో ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి ప్రీమియర్స్ పడనున్నాయి. ఇప్పటికే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవ్వగా.. మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫంకీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అడ్వాన్స్ బుకింగ్‌లో ఫంకీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

Funky Advance Booking Collections in North America Vishwak Sen s movie rampage in USA and Canada

ఫంకీ తారాగణం
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా ఫంకీ సినిమాను నిర్మించారు. ఈ మూవీలో విశ్వక్‌సేన్ సరసన కాయదు లోహర్ హీరోయిన్‌గా నటించారు. వీకే నరేష్, వీటీవీ గణేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా, సురేష్ సారంగం సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫంకీకి సెన్సార్ బోర్డ్.. యూ/ఏ 7+ సర్టిఫికెట్‌ను జారీ చేయగా.. ఈ సినిమా రన్ టైం దాదాపు 128 నిమిషాలని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఫంకీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులు కలిపి ఫంకీ సినిమాకు దాదాపు 15 కోట్ల రూపాయల బట్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లతో పాటు పబ్లిసిటీ కార్యక్రమాలతో విశ్వక్‌సేన్ మూవీపై హైప్ నెలకొంది. విశ్వక్ గత చిత్రాల ట్రాక్ నేపథ్యంలో ఓ మాదిరిగా ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అది ఎంత అనేది మాత్రం తెలియరాలేదు. అయితే ఫంకీ సినిమా బాక్సాఫీస్ వద్ద లాభాల్లోకి రావాలంటే 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఫిబ్రవరి 12న ఫంకీ ప్రీమియర్స్
ఇదిలాఉండగా.. గురువారం రాత్రి నార్త్ అమెరికాలో ఫంకీ మూవీ ప్రీమియర్స్ ప్రదర్శితం కానున్నాయి. నార్త్ అమెరికా సహా ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను మోక్షా మూవీస్ దక్కించుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ప్రీమియర్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా... ఎన్ఆర్ఐ ప్రేక్షకుల నుంచి విశ్వక్‌సేన్ మూవీకి మంచి స్పందన లభిస్తోంది. సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్ నుంచి వస్తోన్న మిడ్ రేంజ్ మూవీ కావడం, విశ్వక్‌సేన్ - అనుదీప్ కాంబో కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.

అడ్వాన్స్ బుకింగ్‌లో ఫంకీకి ఎన్ని కోట్లంటే?
ఫంకీకి అమెరికా వ్యాప్తంగా 195 సెంటర్స్‌లో... 334 షోలకు గాను ఇప్పటి వరకు 3800 టికెట్లకు పైగా అమ్ముడయ్యాయని ట్రేడ్ పండితులు తెలిపారు. తద్వారా ఇప్పటి వరకు విశ్వక్‌సేన్ మూవీ 55,555 డాలర్లు (భారతీయ కరెన్సీలో 50.38 లక్షల రూపాయలు) వసూలు చేసినట్లు మోక్షా మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ప్రీమియర్స్‌కు మరికొద్దిగంటలు సమయం ఉన్న నేపథ్యంలో కలెక్షన్స్ మరింత పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా.. విశ్వక్‌సేన్ సినిమాలలో ప్రీమియర్స్ ద్వారా అత్యధిక మొత్తం వసూలు చేసిన సినిమాగా గామి (160K డాలర్లు - 1.45 కోట్ల రూపాయలు) టాప్‌లో ఉంది. మరి ఈ రికార్డ్‌ను ఫంకీ బద్ధలు కొడుతుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X