Funky Closing Collections: ఫంకీ క్లోజింగ్ కలెక్షన్లు... విశ్వక్‌సేన్ మూవీకి లాభమా? నష్టమా?
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మించిన చిత్రం ఫంకీ. విశ్వక్‌సేన్, కాయదు లోహర్‌లు జంటగా నటించగా.. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు. వీకే నరేష్, వీటీవీ గణేష్, సంపత్ రాజ్, ఈశ్వరి రావు, రఘుబాబు, మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్షన్ చేశారు.. నవీన్ నూలి ఎడిటర్‌గా, సురేష్ సారంగం సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13వ తేదీన ఫంకీ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఫంకీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? విశ్వక్‌సేన్ మూవీకి క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత? ఫంకీకి లాభమెంత? నష్టమెంత? అనేది పరిశీలిస్తే...
ఫంకీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులు కలిపి ఫంకీ సినిమాకు దాదాపు 25 కోట్ల రూపాయల బట్జెట్ అయ్యింది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయాన్ని పరిశీలిస్తే.. నైజాం థియేట్రికల్ రైట్స్ 4 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 1.25 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 10.25 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది ఫంకీ. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 75 లక్షల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను మోక్షా మూవీస్ 2 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. దాంతో వరల్డ్ వైడ్‌గా ఫంకీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 13 కోట్ల రూపాయల మేర చేసింది. విశ్వక్‌సేన్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 14 కోట్ల రూపాయల షేర్, 28 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

ఫంకీ కలెక్షన్స్
ఫంకీ కలెక్షన్స్ పరిశీలిస్తే... ఇండియాలో తొలిరోజు 2.2 కోట్ల రూపాయలు, రెండో రోజు 1.9 కోట్ల రూపాయలు, మూడో రోజు 1.65 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 85 లక్షల రూపాయలు, ఐదో రోజు 68 లక్షల రూపాయలు, ఆరో రోజు 60 లక్షల రూపాయలు, ఏడో రోజు 55 లక్షల రూపాయలు, ఎనిమిదో రోజు 19 లక్షల రూపాయలు చొప్పున 8.62 కోట్ల రూపాయల నెట్... 9.95 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది. కర్ణాటకలో కోటి రూపాయలు, తెలుగులో 9.50 కోట్ల రూపాయలు, తమిళనాడులో 15 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 20 లక్షల రూపాయలు చొప్పున విశ్వక్‌సేన్ మూవీ వసూలు చేసింది.
ఫంకీ ఓవర్సీస్ కలెక్షన్స్
విశ్వక్‌సేన్ మూవీకి నార్త్ అమెరికాలో 3 లక్షల డాలర్లు ( భారత కరెన్సీలో 2.72 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో 50 లక్షల రూపాయలు రాబట్టింది విశ్వక్‌సేన్ మూవీ. మొత్తంగా ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో 3.20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 13.15 కోట్ల రూపాయల గ్రాస్.. 8 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.
ఫంకీకి లాభమెంత? నష్టమెంత?
అనుదీప్ కేవీ, విశ్వక్‌సేన్ క్రేజ్‌లకు తోడు వీకెండ్, మహా శివరాత్రి పర్వదినాల సందర్భంగా ఫస్ట్ వీక్ బాగానే గడిచింది. అయితే సోమవారం నుంచి ఫంకీ క్రమంగా కలెక్షన్స్ కోల్పోయింది. వర్కింగ్ డేస్, పరీక్షల కారణంగా బుకింగ్స్ పడిపోవడంతో ఫంకీ కష్టాలు ఎదుర్కొంది. ఫంకీ లాభాల్లోకి రావాలంటే 28 కోట్ల రూపాయల గ్రాస్‌కి గాను 13 కోట్ల రూపాయలు మాత్రమే రావడంతో 15 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. ఇక డిస్ట్రిబ్యూషన్ షేర్ పరంగా 14 కోట్ల రూపాయలకు గాను 6 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది ఫంకీ. అయితే ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో, డబ్బింగ్ రైట్స్‌కి జరిగిన బిజినెస్‌పరంగా నిర్మాత సేఫ్ జోన్‌లోకి వచ్చినట్లేనని ట్రేడ్ పండితులు తెలిపారు.


Click it and Unblock the Notifications











