Funky Day 1 Collections: ఫంకీ బాక్సాఫీస్ కలెక్షన్స్.. విశ్వక్‌సేన్ మూవీకి తొలిరోజు ఎన్ని కోట్లంటే?
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా, కాయదు లోహార్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ఫంకీ. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా ఫంకీ సినిమాను నిర్మించారు. వీకే నరేష్, వీటీవీ గణేష్, సంపత్ రాజ్, ఈశ్వరి రావు, రఘుబాబు, మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా, సురేష్ సారంగం సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13వ తేదీన ఫంకీ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఫంకీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? విశ్వక్‌సేన్ మూవీ తొలిరోజు ఎన్ని కోట్లు రాబట్టిందంటే?
ఫంకీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులు కలిపి ఫంకీ సినిమాకు దాదాపు 15 కోట్ల రూపాయల బట్జెట్ అయ్యింది. మీడియం రేంజ్ సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా మూవీని నిర్మించారు మేకర్స్. అనుదీప్ దర్శకుడు కావడంతో పాటు టీజర్, ట్రైలర్లతో పాటు పబ్లిసిటీ కార్యక్రమాలతో విశ్వక్‌సేన్ మూవీపై హైప్ నెలకొంది. దానికి తగినట్లుగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. విశ్వక్‌సేన్ డిజాస్టర్స్ కొంత ఎఫెక్ట్ చూపించినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఫంకీ ప్రీ రిలీజ్ బిజినెస్
ఫంకీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే... నైజాం థియేట్రికల్ రైట్స్ 4 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 1.25 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 10.25 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది ఈ మూవీ. ఇక కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 75 లక్షల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను మోక్షా మూవీస్ 2 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. దాంతో వరల్డ్ వైడ్‌గా ఫంకీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 13 కోట్ల రూపాయల మేర చేసింది. విశ్వక్‌సేన్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 14 కోట్ల రూపాయల షేర్, 28 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
ఫంకీ ఓవర్సీస్ కలెక్షన్స్
విశ్వక్‌సేన్ మూవీకి ఓవర్సీన్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫిబ్రవరి 12వ తేదీన ప్రీయర్స్ కోసం బుకింగ్ ఓపెన్ చేయగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అమెరికా వ్యాప్తంగా ఫంకీ ప్రీమియర్స్ 226 సెంటర్లలో 404 షోలకు 5587 టికెట్లు అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకు అందిన లెక్కల ప్రకారం ప్రీమియర్స్ షోలకు గాను 80488 డాలర్లు (73 లక్షల రూపాయలు) వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే ఫంకీకి ప్రీమియర్స్ ద్వారా అమెరికాలో 125K డాలర్లు (1.13 కోట్ల రూపాయలు) వసూలైనట్లు ఈ సినిమాకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోన్న మోక్షా మూవీస్ తెలిపింది.
ఫంకీ తొలిరోజు కలెక్షన్స్
పాజిటివ్ రివ్యూలు, టాక్‌తో ఫంకీ సినిమాకు మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా యూత్ నుంచి రెస్పాన్స్ వస్తున్నట్లుగా చెబుతున్నారు. తొలిరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఇండియాలో ఫంకీ మూవీకి 25.12 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ నివేదించింది. వీకెండ్ కావడంతో ఫస్ట్ షో, సెకండ్ షోలకు మంచి బుకింగ్స్ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 381 షోలు, బెంగళూరులో 221 షోలు, విశాఖలో 109 షోలు, విజయవాడలో 85 షోలు ప్రదర్శితమైనట్లుగా సాక్‌నిక్ పేర్కొంది. కడపటి వార్తలు అందేసరికి ఫంకీ మూవీకి ఇండియాలో 58 లక్షల రూపాయల నెట్ వసూలైనట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తొలిరోజు విశ్వక్‌సేన్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











