Funky Day 2 Collections: ఫంకీకి డీసెంట్ కలెక్షన్స్.. విశ్వక్‌సేన్ మూవీకి రెండో రోజు ఎన్ని కోట్లంటే?

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా ఫంకీ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా, కాయదు లోహార్ హీరోయిన్‌గా నటించారు. వీకే నరేష్, వీటీవీ గణేష్, సంపత్ రాజ్, ఈశ్వరి రావు, రఘుబాబు, మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్షన్ చేశారు.. నవీన్ నూలి ఎడిటర్‌గా, సురేష్ సారంగం సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13వ తేదీన ఫంకీ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఫంకీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? విశ్వక్‌సేన్ మూవీ రెండో రోజు ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

ఫంకీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులు కలిపి ఫంకీ సినిమాకు దాదాపు 15 కోట్ల రూపాయల బట్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లతో పాటు పబ్లిసిటీ కార్యక్రమాలతో విశ్వక్‌సేన్ మూవీపై హైప్ నెలకొంది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయాన్ని పరిశీలిస్తే.. నైజాం థియేట్రికల్ రైట్స్ 4 కోట్ల రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 1.25 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 10.25 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది ఈ మూవీ.

Funky Day 2 Expected Box Office Collections Worldwide Vishwak Sen s film witnessed good growth

ఇక కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 75 లక్షల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను మోక్షా మూవీస్ 2 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. దాంతో వరల్డ్ వైడ్‌గా ఫంకీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 13 కోట్ల రూపాయల మేర చేసింది. విశ్వక్‌సేన్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 14 కోట్ల రూపాయల షేర్, 28 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

ఫంకీ తొలిరోజు కలెక్షన్స్
విశ్వక్‌సేన్ మూవీకి తొలి రోజున ఇండియాలో 2.25 కోట్ల రూపాయల నెట్.. 3.65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఇక ఓవర్సీస్‌లో ఫంకీ మూవీకి ప్రీమియర్స్ + ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి 160 K డాలర్లు (భారత కరెన్సీలో 1.44 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఫంకీ మూవీకి వరల్డ్ వైడ్‌గా 4 కోట్ల రూపాయలకు పైగా ఓపెనింగ్స్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఫంకీ రెండో రోజు కలెక్షన్స్
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో ఫంకీ దూసుకెళ్తోంది. వీకెండ్ కావడంతో ఫంకీకి మంచి బుకింగ్స్ జరుగుతున్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు 18.66 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు నైట్ షోలకు బుకింగ్స్ పెరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో 344 షోలు, బెంగళూరులో 188 షోలు, విజయవాడలో 82, విశాఖపట్నంలో 97 షోలు చొప్పున ప్రదర్శితమయ్యాయి.

ఇప్పటి వరకు అందుతున్న లెక్కల ప్రకారం ఫంకీకి రెండో రోజు ఇండియాలో 45 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ వసూలైంది. రెండో రోజు ఇండియాలో 2.50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 4 కోట్ల రూపాయల వరకు ఫంకీ మూవీ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. దాంతో రెండ్రోజుల్లో విశ్వక్‌సేన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X