Funky Day 3 Collections: నిలకడగా ఫంకీ కలెక్షన్స్.. 3 రోజుల్లో విశ్వక్‌సేన్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందంటే?
జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్, యంగ్ బ్యూటీ కాయదు లోహర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఫంకీ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా ఫంకీ సినిమాను నిర్మించారు. వీకే నరేష్, వీటీవీ గణేష్, సంపత్ రాజ్, ఈశ్వరి రావు, రఘుబాబు, మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్షన్ చేశారు.. నవీన్ నూలి ఎడిటర్‌గా, సురేష్ సారంగం సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13వ తేదీన ఫంకీ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఫంకీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? విశ్వక్‌సేన్ మూవీ మూడో రోజు ఎన్ని కోట్లు రాబట్టిందంటే?
ఫంకీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులు కలిపి ఫంకీ సినిమాకు దాదాపు 15 కోట్ల రూపాయల బట్జెట్ అయ్యింది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయాన్ని పరిశీలిస్తే.. నైజాం థియేట్రికల్ రైట్స్ 4 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 1.25 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 10.25 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది ఫంకీ.

ఇక కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 75 లక్షల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను మోక్షా మూవీస్ 2 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. దాంతో వరల్డ్ వైడ్‌గా ఫంకీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 13 కోట్ల రూపాయల మేర చేసింది. విశ్వక్‌సేన్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 14 కోట్ల రూపాయల షేర్, 28 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
ఫంకీ రెండు రోజుల కలెక్షన్స్
విశ్వక్‌సేన్ మూవీకి తొలి రోజున 2.25 కోట్ల రూపాయలు, రెండో రోజున 2 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది. ఇప్పటి వరకు ఇండియాలో 4.2 కోట్ల రూపాయల నెట్.. 4.95 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ వెల్లడించింది. ఓవర్సీస్‌లో ఫంకీ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రీమియర్స్‌లో సత్తా చాటిన ఈ చిత్రం వీకెండ్‌ను బాగానే క్యాష్ చేసుకుంటోంది. శనివారం వరకు నార్త్ అమెరికాలో 205K డాలర్లు (భారత కరెన్సీలో 1.85 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో ఈ మూవీకి 20 లక్షల రూపాయలు వసూలైంది. దాంతో ఓవర్సీస్ నుంచి ఇప్పటి వరకు ఫంకీ మూవీకి 2 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి విశ్వక్‌సేన్ మూవీకి వరల్డ్ వైడ్‌గా రెండ్రోజుల్లో 7 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది.
ఫంకీ మూడో రోజు కలెక్షన్స్
ఆదివారం, మహాశివరాత్రి కావడంతో ఫంకీ మూవీకి మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. రిలీజైన నాటి నుంచి ఇప్పటి వరకు బుక్ మై షోలో ఈ సినిమాకు 100k టికెట్లు అమ్ముడైనట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలిపింది. 3వ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు విశ్వక్‌సేన్ మూవీకి ఇండియాలో 17.48 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ వెల్లడించింది. కడపటి వార్తలు అందేసరికి ఫంకీ మూవీకి 3వ రోజు ఇండియాలో 50 లక్షల రూపాయల నెట్ వసూలైంది. ఆదివారం ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 3.50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందని భావిస్తున్నారు. దాంతో కలిపి ఇప్పటి వరకు విశ్వక్‌సేన్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల రూపాయల పైగా కలెక్షన్స్ సాధించొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











