Funky Day 4 Collections: ఫంకీ కలెక్షన్స్‌పై ఊహించని దెబ్బ.. విశ్వక్‌సేన్ మూవీకి నష్టాలు తప్పాలంటే?

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మించిన చిత్రం ఫంకీ. విశ్వక్‌సేన్, కాయదు లోహర్‌లు జంటగా నటించగా.. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు. వీకే నరేష్, వీటీవీ గణేష్, సంపత్ రాజ్, ఈశ్వరి రావు, రఘుబాబు, మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్షన్ చేశారు.. నవీన్ నూలి ఎడిటర్‌గా, సురేష్ సారంగం సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13వ తేదీన ఫంకీ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఫంకీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? విశ్వక్‌సేన్ మూవీ మూడో రోజు ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

ఫంకీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులు కలిపి ఫంకీ సినిమాకు దాదాపు 15 కోట్ల రూపాయల బట్జెట్ అయ్యింది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయాన్ని పరిశీలిస్తే.. నైజాం థియేట్రికల్ రైట్స్ 4 కోట్ల రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 1.25 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 10.25 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది ఫంకీ.

Funky Day 4 Expected Box Office Collections Worldwide Vishwak Sen s Film saw a drop on its first Monday

ఫంకీ బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత
ఇక కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 75 లక్షల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను మోక్షా మూవీస్ 2 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. దాంతో వరల్డ్ వైడ్‌గా ఫంకీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 13 కోట్ల రూపాయల మేర చేసింది. విశ్వక్‌సేన్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 14 కోట్ల రూపాయల షేర్, 28 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

ఫంకీ మూడు రోజుల కలెక్షన్స్
ఫంకీ మూవీకి తొలిరోజు 2.2 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.9 కోట్ల రూపాయలు, మూడో రోజున 1.68 కోట్ల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు ఇండియాలో 4.85 కోట్ల రూపాయల నెట్.. 5.78 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే... మూడు రోజుల వరకు నార్త్ అమెరికాలో 250K డాలర్లు (భారత కరెన్సీలో 2.26 కోట్ల రూపాయలు) రాబట్టినట్లు ఈ చిత్ర ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ తెలిపాడు. యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో కలిపి ఈ మూవీకి 40 లక్షల రూపాయలు వసూలైంది. దాంతో ఫంకీకి ఓవర్సీస్ నుంచి మొత్తంగా 2.65 లక్షల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఈ మూవీకి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 7.5 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు సాక్‌నిక్ పేర్కొంది.

ఫంకీ నాలుగో రోజు కలెక్షన్స్
వీకెండ్, మహాశివరాత్రి కావడంతో తొలి మూడు రోజులు ఫంకీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అయితే సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలుకావడంతో విశ్వక్‌సేన్ మూవీ బుకింగ్స్‌పై ఎఫెక్ట్ పడినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. 4వ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఫంకీ మూవీకి ఇండియాలో 13.30 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. కడపటి వార్తలు అందేసరికి విశ్వక్‌సేన్ మూవీకి ఇండియాలో 15 లక్షల రూపాయల నికర కలెక్షన్స్ వచ్చాయి. ట్రెండ్స్‌ను బట్టి తెలుగు రాష్ట్రాలు, వరల్డ్ వైడ్‌గా విశ్వక్‌సేన్ మూవీకి నాలుగో రోజు కోటి రూపాయల గ్రాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు. తద్వారా ఇప్పటి వరకు ఫంకీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 8.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫంకీ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా 9.5 కోట్ల రూపాయల షేర్.. 10 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X