twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Gaali Sampath 3 Days Collections: దారుణంగా పడిపోయిన కలెక్షన్లు.. వెలుగులోకొచ్చిన షాకింగ్ న్యూస్!

    |

    లాక్‌డౌన్ తర్వాత తెలుగు సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. సంక్రాంతి సీజన్‌లో నిర్మాత జేబులు నిండిపోయాలా కలెక్షన్లు రావడంతో.. వారానికి మూడు నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. అన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కథా ప్రాధాన్యంతో రూపొంది ఆడియెన్స్ ముందుకు వచ్చిన చిత్రం 'గాలి సంపత్'. శివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్లు మాత్రం అంతగా రావడం లేదు. అదే సమయంలో భారీ పరాభయం ఎదరయ్యేలా ఉంది. ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!

    చీరకట్టు అందాలతో అనసూయ భరద్వాజ్: స్టేజీపై డాన్స్ (ఫొటోలు)

    సందడి చేసేందుకు వచ్చిన ‘గాలి సంపత్'

    సందడి చేసేందుకు వచ్చిన ‘గాలి సంపత్'

    అనిష్ కృష్ణ దర్శకత్వంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్.. టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే 'గాలి సంపత్'. ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం పర్యవేక్షణతో పాటు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించాడు. షైన్ స్క్రీన్స్ సంస్థతో కలిసి ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఎస్ కృష్ణ దీన్ని నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు సరసన ల‌వ్‌లీ సింగ్ హీరోయిన్‌గా నటించింది.

    అంచనాలను పెంచేసిన టీమ్... బిజినెస్

    అంచనాలను పెంచేసిన టీమ్... బిజినెస్

    పెద్ద స్టార్లు నటించకున్నా టీజర్, ట్రైలర్‌తో పాటు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి భాగస్వామ్యం ఉండడంతో 'గాలి సంపత్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ నైజాంలో రూ. 2 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, ఆంధ్రాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌తో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలకు అమ్ముడుపోయింది. మొత్తంగా ఈ చిత్రం రూ. 6.50 కోట్లు బిజినెస్‌ జరుపుకుంది.

    మూడో రోజు ఎక్కడ? ఎంత రాబట్టిందంటే?

    మూడో రోజు ఎక్కడ? ఎంత రాబట్టిందంటే?

    మూడో రోజు 'గాలి సంపత్‌'కు భారీ షాకిచ్చారు ఆడియెన్స్. ఫలితంగా నైజాంలో రూ. 2 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1 లక్షలు, వెస్ట్‌లో రూ. 40 వేలు, గుంటూరులో రూ. 60 వేలు, కృష్ణాలో రూ. 70 వేలు, నెల్లూరులో రూ. 20 వేలతో మూడో రోజైన శనివారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 8 లక్షలు షేర్, రూ. 14 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది.

    మూడు రోజులకు కలిపి ఎంత వసూలయింది?

    మూడు రోజులకు కలిపి ఎంత వసూలయింది?

    మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 52 లక్షలు వసూలు చేసిన గాలి సంపత్... రెండో రోజు మాత్రం నిరాశనే ఎదుర్కొంటూ రూ. 12 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇక, మూడో రోజు ఈ చిత్రం ప్రదర్శితమవుతోన్న థియేటర్లలో చాలా వరకు 'జాతి రత్నాలు'కు కేటాయించారు. దీంతో కేవలం రూ. 8 లక్షలే వచ్చాయి. ఫలితంగా మొత్తంగా ఈ చిత్రం రూ. 72 లక్షలే కలెక్ట్ చేయడం గమనార్హం.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?

    తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు కలెక్షన్లు సాధించిన 'గాలి సంపత్'.. మిగిలిన ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితితో కనిపించింది. ఏపీ తెలంగాణలో కలిపి రూ. 72 లక్షలు రాబట్టిన ఈ చిత్రం.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 4 లక్షలు మాత్రమే వసూలు చేసింది. అంటే రెండు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 79 లక్షలు షేర్.... 1.29 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది.

    బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెత వస్తే హిట్?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెత వస్తే హిట్?

    'గాలి సంపత్'కు మొత్తంగా రూ. 6.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్‌ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 7 కోట్లుగా నమోదైంది. ఇక, రెండు రోజులకు రూ. 79 లక్షలు వసూలు చేయడంతో.. హిట్ కోసం మరో రూ. 6.21 కోట్లు రాబట్టాల్సి ఉంది. అయితే, మూడో రోజే దారుణంగా పడిపోవడంతో అంత టార్గెట్‌ను చేరుకోవడం కష్టంగా మారింది. ఇక, ఆదివారాల్లో పుంజుకుంటుందేమో చూడాలి.

    English summary
    Gaali Sampath Telugu Movie Trailer on Shine Screens. #GaaliSampath​ Latest 2021 Telugu Movie ft. Sree Vishnu, Rajendra Prasad, Lovely Singh, Tanikella Bharani, and Sathya. Presented by Anil Ravipudi. Directed by Anish Krishna and Produced by S Krishna under Imagespark Entertainment in association with Shine Screens. Music composed by Achu Rajamani. Gaali Sampath movie is all set to hit the big screens on March 11th, 2021.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X