twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Gaali Sampath Closing collections: భారీ టార్గెట్.. వచ్చింది కోటి లోపే.. షాకింగ్‌గా ఫైనల్ రిపోర్టు!

    |

    లాక్‌డౌన్ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి ఊపరి వచ్చినట్లు అయింది. దీనికి కారణం గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు విడుదలైన చాలా చిత్రాలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటుండడమే. వీటిలో చాలా వరకూ సూపర్ డూపర్ హిట్లు కాగా, కొన్ని ఏవరేజ్‌గా, మరికొన్ని డిజాస్టర్లుగా మిగిలాయి. అయితే, ఒక సినిమా మాత్రం భారీ అంచనాలతో వచ్చి కేవలం నాలుగు రోజుల్లోనే రేసు నుంచి తప్పుకుంది. అదే 'గాలి సంపత్'. మంచి టాక్‌తో ప్రారంభమైన ఈ సినిమా వారానికే కథ ముగించేసింది. దీంతో భారీ నష్టాలు వచ్చాయి. ఆ వివరాలు మీకోసం!

    అలా సందడి చేయడానికి వచ్చిన ‘గాలి సంపత్'

    అలా సందడి చేయడానికి వచ్చిన ‘గాలి సంపత్'

    నట కిరీటి రాజేంద్ర ప్రసాద్.. టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో అనిష్ కృష్ణ తెరకెక్కించిన చిత్రమే 'గాలి సంపత్'. ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం పర్యవేక్షణతో పాటు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించాడు. షైన్ స్క్రీన్స్ సంస్థతో కలిసి ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఎస్ కృష్ణ దీన్ని నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు సరసన ల‌వ్‌లీ సింగ్ హీరోయిన్‌గా నటించింది.

    అంచనాలను పెంచేసిన మూవీ... బిజినెస్ ఇలా

    అంచనాలను పెంచేసిన మూవీ... బిజినెస్ ఇలా

    పెద్ద స్టార్లు నటించకున్నా టీజర్, ట్రైలర్‌తో పాటు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి భాగస్వామ్యం ఉండడంతో 'గాలి సంపత్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ నైజాంలో రూ. 2 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, ఆంధ్రాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌తో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలకు అమ్ముడుపోయింది. మొత్తంగా ఈ చిత్రం రూ. 6.50 కోట్లు బిజినెస్‌ జరుపుకుంది.

    వారానికే క్లోజింగ్.. ఎక్కడ? ఎంత? వచ్చింది?

    వారానికే క్లోజింగ్.. ఎక్కడ? ఎంత? వచ్చింది?

    భారీ ధరకే అమ్ముడు పోయిన 'గాలి సంపత్'కు అన్ని ఏరియాల్లో నిరాశే ఎదురైంది. ఏరియాల ప్రకారం ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్లను చూసుకుంటే.. నైజాంలో రూ. 25 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 15 లక్షలు, ఈస్ట్‌లో రూ. 6 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 20 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలు వసూలు అయ్యాయి.

    ముగింపు సమయానికి ఎంత రాబట్టిందంటే?

    ముగింపు సమయానికి ఎంత రాబట్టిందంటే?

    మొదటి రోజు మంచి టాక్‌నే సంపాదించుకున్న 'గాలి సంపత్'.. కలెక్షన్లు మాత్రం అంతగా రాబట్టలేకపోయింది. మొదటి రోజు రూ. 52 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా... రెండో రోజు మాత్రం రూ. 12 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇక, మూడో రోజు థియేటర్లు డౌన్ అవడంతో కేవలం రూ. 8 లక్షలే వచ్చాయి. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 84 లక్షలు మాత్రమే రాబట్టగలిగిందీ చిత్రం.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?

    తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా వచ్చిన 'గాలి సంపత్' కలెక్షన్లు.. మిగిలిన ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితితో కనిపించింది. ఏపీ తెలంగాణలో కలిపి రూ. 84 లక్షలు రాబట్టిన ఈ చిత్రం.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 8 లక్షలు మాత్రమే వసూలు చేసింది. అంటే క్లోజింగ్ టైమ్‌కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 97 లక్షలు షేర్.... 1.70 కోట్లు గ్రాస్‌ను మాత్రమే వచ్చింది.

    Recommended Video

    Nagarjuna's Wild Dog Interview Part 1 | నాగ్ ఫుల్ హ్యాపీ..!!
    బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెత వస్తే హిట్?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెత వస్తే హిట్?

    'గాలి సంపత్'కు మొత్తంగా రూ. 6.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్‌ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 7 కోట్లుగా నమోదైంది. ఇక, ముగింపు సమయానికి రూ. 97 లక్షలు వసూలు చేయడంతో.. చిత్ర నిర్మాతకు రూ. 6.03 కోట్లు నష్టాలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది తక్కువ శాతం వసూలు చేసిన చిత్రాల జాబితాలోకి చేరిపోయిన ఇది.. డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

    English summary
    Gaali Sampath Telugu Movie Trailer on Shine Screens. #GaaliSampath​ Latest 2021 Telugu Movie ft. Sree Vishnu, Rajendra Prasad, Lovely Singh, Tanikella Bharani, and Sathya. Presented by Anil Ravipudi. Directed by Anish Krishna and Produced by S Krishna under Imagespark Entertainment in association with Shine Screens. Music composed by Achu Rajamani. Gaali Sampath movie is all set to hit the big screens on March 11th, 2021.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X