Gaali Sampath Day 1 Collections: ఊహించని విధంగా ‘గాలి సంపత్’ కలెక్షన్స్.. తొలి రోజు ఎంత వచ్చిందంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా ప్రయోగాత్మక చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. అందులోనూ దక్షిణాదిలోని ఇతర భాషల మాదిరిగా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న.. కథకే ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించేందుకు ఇప్పటి వాళ్లు సిద్ధం అవుతున్నారు. అందుకు అనుగుణంగానే ఈ మధ్య కాలంలో ఆ తరహాలో చాలా సినిమాలు రూపొందాయి. అవన్నీ ప్రేక్షకుల మెప్పును పొందాయి. ఆ కోవలోనే ఇప్పుడు వచ్చిన చిత్రం 'గాలి సంపత్'. మహా శివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు ఊహించని రీతిలో కలెక్షన్లు వచ్చాయి. ఆ బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!

అతడితో కలిసి సందడి చేస్తున్న ‘గాలి సంపత్'

అతడితో కలిసి సందడి చేస్తున్న ‘గాలి సంపత్'

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్.. టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రమే 'గాలి సంపత్'. అనిష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం పర్యవేక్షణతో పాటు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించాడు. షైన్ స్క్రీన్స్ సంస్థతో కలిసి ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఎస్ కృష్ణ దీన్ని నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు సరసన ల‌వ్‌లీ సింగ్ హీరోయిన్‌గా నటించింది.

అలా అంచనాలను పెంచేసిన టీమ్... బిజినెస్

అలా అంచనాలను పెంచేసిన టీమ్... బిజినెస్

టీజర్, ట్రైలర్‌తో పాటు అనిల్ రావిపూడి పర్యవేక్షణ ఉండడంతో 'గాలి సంపత్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ నైజాంలో రూ. 2 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, ఆంధ్రాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌తో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలకు అమ్ముడుపోయింది. అంటే మొత్తంగా ఈ చిత్రం రూ. 6.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్‌ను జరుపుకుంది.

 మూవీకి అలాంటి రెస్పాన్స్... రివ్యూలు కూడా

మూవీకి అలాంటి రెస్పాన్స్... రివ్యూలు కూడా

మహా శివరాత్రి సందర్భంగా మరో మూడు సినిమాలతో 'గాలి సంపత్' కలిసి గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే దీనికి మంచి టాక్ వచ్చింది. అదే సమయంలో రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. మరీ ముఖ్యంగా ఇందులో రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు నటనకు ప్రశంసలు దక్కాయి. దీంతో ఈ సినిమా దూసుకుపోతుందన్న టాక్ బాగా వినిపించింది.

ఫస్ట్ రోజు ‘గాలి సంపత్' ఎంత కలెక్ట్ చేశాడు?

ఫస్ట్ రోజు ‘గాలి సంపత్' ఎంత కలెక్ట్ చేశాడు?

మొదటి రోజు 'గాలి సంపత్‌'కు ఏవరేజ్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 16 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 1.50 లక్షలు, గుంటూరులో రూ. 17.60 లక్షలు, కృష్ణాలో రూ. 1.50 లక్షలు, నెల్లూరులో రూ. 1.20 లక్షలతో తొలిరోజు రెండు రాష్ట్రాల్లో రూ. 52 లక్షలు షేర్, రూ. 73 లక్షలు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు కలెక్షన్లు సాధించిన 'గాలి సంపత్'.. మిగిలిన ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితితో కనిపించింది. ఏపీ తెలంగాణలో కలిపి రూ. 52 లక్షలు రాబట్టిన ఈ చిత్రం.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2 లక్షలు మాత్రమే వసూలు చేసింది. అంటే మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 56 లక్షలు షేర్.... 80 లక్షలు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెత వస్తే హిట్?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెత వస్తే హిట్?

'గాలి సంపత్'కు మొత్తంగా రూ. 6.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్‌ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 7 కోట్లుగా నమోదైంది. ఇక, మొదటి రోజు రూ. 56 లక్షలు వసూలు చేయడంతో.. హిట్ కోసం మరో రూ. 6.44 కోట్లు రాబట్టాల్సి ఉంది. లాంగ్ వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా శని, ఆదివారాలు ఈ చిత్రం ప్రభావాన్ని చూపించాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X